అమెరికాతో భారత్ మరో భారీ వెపన్ డీల్.. పాక్, చైనాకు దబిడి దిబిడే

అమెరికాతో భారత్ మరో భారీ వెపన్ డీల్.. పాక్, చైనాకు దబిడి దిబిడే

అగ్ర రాజ్యం అమెరికాతో భారత్ మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. పొరుగు దేశం బంగ్లాదేశ్‎లో అల్లర్లు, తూర్పు లడఖ్‌లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు, దాయాది పాకిస్థాన్‎తో సీమాంతర ఉగ్రవాద ముంపు పొంచి ఉన్న నేపథ్యంలో భారత ఆర్మీ ఆయుధ సంపత్తిని మరింత స్ట్రాంగ్ చేయడంలో భాగంగా అమెరికాతో ఆయుధాల కొనుగోలు అగ్రిమెంట్ చేసుకుంది. తాజాగా 73,000  ఎస్ఐజీ-_716 అస్సాల్ట్ రైఫిల్ కొనుగోళ్లకు అమెరికాతో డీల్ కుదుర్చుకుంది. 

ఈ అగ్రిమెంట్ విలువ దాదాపు రూ. 837 కోట్లని సమాచారం. ఈ ఒప్పందానికి ముందే ఇదే  రైఫిళ్ల కోసం భారత్, అమరికా మధ్య ఒప్పందం జరిగింది. మొదటి ఒప్పందంలో 72,400 ఎస్ఐజీ-_716 కొనుగోళ్లకు డీల్ సెట్ అయ్యింది. ఇదిలా ఉండగానే.. తాజాగా మరో 73,000 వెపన్స్‎ను భారత్ ఆర్డర్ చేసింది. ఈ రెండు ఒప్పందాల ద్వారా 7.62x51mm క్యాలిబర్  కలిగిన 1.45 లక్షల ఎస్ఐజీ అస్సాల్ట్ రైఫిళ్లు భారత సైన్యం అమ్ముల పొదిలో చేరనున్నాయి.

 ఈ రైఫిళ్లను భారత్..  చైనా, పాకిస్తాన్‌లతో సరిహద్దుల వెంబడి మోహరించిన బెటాలియన్‌ల సైనికులకు అందించనుంది. 500 మీటర్స్ రేంజ్ కలిగిన ఈ ఎస్ఐజీ అస్సాల్ట్ రైఫిల్స్ భారత్ ఆర్మీలో కీలకం పాత్ర పోషించననున్నట్లు సైనికాధికారులు అంచనా వేస్తున్నారు. రష్యాకు చెందిన ఎకె-203 కలాష్నికోవ్ రైఫిళ్ల తయారీ, డెలివరీలో ఆలస్యం జరగడంతో భారత్ అమెరికాతో ఈ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం.