IND vs ENG 3rd Test: ఇండియా బ్యాటింగ్.. ఇంగ్లాండ్ కు 5 పరుగులు.. ఏం జరిగిందంటే..?

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా భారీ స్కోర్ చేసేలా కనిపిస్తోంది. లంచ్ విరామ సమాయానికి 7 వికెటట్లు కోల్పోయి 388 పరుగులు చేసింది. క్రీజులో రవిచంద్రన్ అశ్విన్(25), టెస్ట్ అరంగేట్రం చేసిన ధృవ్ జురెల్(31) ఉన్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ సంగతి పక్కన పెడితే.. ఇంగ్లాండ్ జట్టుకు ఫ్రీగా 5 పరుగులు వచ్చాయి. దీంతో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్ 0తో కాకుండా 5 పరుగులతో ప్రారంభించనుంది.

భారత్ ఇన్నింగ్స్ 102 ఓవర్లో రెహన్ అహ్మద్ బౌలింగ్ లో అశ్విన్ డిఫెన్సివ్ ఆడాడు. ఆ బంతికి పరుగులేమీ రాకపోగా.. సింగిల్ కోసం యత్నించిన అశ్విన్ పిచ్ మధ్యలో పరిగెత్తాడు. దీంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ జోయెల్ విల్సన్.. అశ్విన్‌కు వార్నింగ్ ఇస్తూనే ఇంగ్లాండ్ జట్టుకు 5 పరుగులు అదనంగా ఇచ్చాడు. తొలి రోజు ఆటలో భాగంగా జడేజా పిచ్ పై పరిగెత్తడంతో అంపైర్లు మందలించారు. వరుసగా రెండో రోజు ఆ తప్పు రిపీట్ కావడంతో భారత జట్టుకు పెనాల్టీ తప్పలేదు.

తొలి రోజు రోహిత్ శర్మ (131), జడేజా (112) సెంచరీలతో కదం తొక్కగా.. కెరీర్ లో తొలి టెస్ట్ ఆడిన సర్ఫరాజ్ ఖాన్ (66 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 62) మెరుపు ఫిఫ్టీతో ఇంటర్నేషనల్ క్రికెట్‌‌‌‌లోకి తన రాకను ఘనంగా చాటుకున్నాడు. రెండో రోజు ఆట ప్రారంభంలో జడేజా, కుల్దీప్ యాదవ్ వికెట్లను కోల్పోయినా.. అశ్విన్, జురెల్ అజేయంగా 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ ను ఆదుకున్నారు. దీంతో భారత్ 400 పరుగుల మార్క్ ఈజీగా అందుకునే అవకాశం కనిపిస్తోంది.