ఇండియాలో తొలి బీటా జనరేషన్ కిడ్.. ఎక్కడ పుట్టిందంటే..

ఇండియాలో తొలి బీటా జనరేషన్ కిడ్.. ఎక్కడ పుట్టిందంటే..

జనరేషన్స్ మారుతున్నాయి. ఇప్పటి దాకా ఉన్న జనరేషన్ 2024తో ముగిసింది. ఇక 2025 జనవరి నుంచి మరో జనరేషన్ ప్రారంభమయ్యింది. 1990లలో పుట్టిన వారిని నైన్టీస్ జనరేషన్ అని, 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వారిని  2K జనరేషన్ అని పిలుస్తుంటాం. పిల్లలను ఐతే నైన్టీస్ కిడ్స్, 2K కిడ్స్  అని పిలుస్తుంటాం కదా.. ఇప్పుడు అలాగే బీటా కిడ్స్ జనరేషన్ వచ్చేసింది. 

బీటా జనరేషన్ 1 జనవరి 2025  నుంచి ప్రారంభం అయ్యింది. ఐతే.. దీని ప్రకారం ఇండియాలో మొదటి బీటా బేబీ మిజోరంలో  పుట్టింది.  జనవరి 1, 2025 రాత్రి 12.03 నిమిషాలకు.. డర్ట్‌లాంగ్‌లోని సినోడ్ హాస్పిటల్‌లో మొదటి బీటా బేబీ బాయ్ పుట్టాడు. ఆ మగ బిడ్డ పేరు ఫ్రాంకీ (FRANKIE) అని పెట్టారు. ఇదో చరిత్రాత్మక ఘటనగా తెలిపారు. ఇక భారత చరిత్రలో తొలి బీటా బేబీ ఎవరంటే.. ఆన్సర్ ఫ్రాంకీ అని గుర్తించుకోవాల్సిందే.

మిజోరంలో పుట్టిన బిడ్డనే మొదటి బీటా కిడ్ అని ఎందుకు అంటున్నారంటే.. కొత్త సంవత్సరం వచ్చిన 3 నిమిషాలకు పుట్టాడు కాబట్టి. అందుకే.. తొలి బీటా బేబీ అయ్యాడు. ఈ పసికందు చాలా ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. ఇండియాలో స్టార్ట్ అవుతున్న కొత్త జనరేషన్‌కి ఇతను ఆజ్యం పోశాడని డాక్టర్లు అంటున్నారు.

ఫ్రాంకీ ఐజ్వాల్ లోని ఖాట్లా ఈస్ట్ కమ్యూనిటీకి చెందిన తల్లిదండ్రులు రామ్జీర్‌మావీ, జెడ్‌డీ రెమ్రువాత్‌సంగాలకు జన్మించాడు. కొత్త తరానికి తమ బిడ్డ మొదటివాడు కావడం గర్వంగా ఉందని ఫ్రాంకీ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ బిడ్డ 3.120 కేజీల బరువుతో నార్మల్ డెలివరీలోనే పుట్టడం విశేషం. పిల్లాడు పుట్టిన సందర్భం చూసి.. డాక్టర్లు, నర్సులూ ఆనందపడ్డారు. ఎందుకంటే ఆ బిడ్డ.. బీటా బేబీ కాబట్టి. ఈ బిడ్డకు గ్రాండ్ పేరెంట్స్.. ఫ్రాంకీ రెమ్రువాత్‌డికా జాడెంగ్ అని పేరు పెట్టారు.

ALSO READ | HMPV కేసులు: మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ లో తాజా పరిస్థితులు ఇలా..

"నన్ను డెలివరీ కోసం డిసెంబర్ 31, 2024న ఆస్పత్రిలో చేర్పించారు. అదృష్టం కొద్దీ బిడ్డ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పుట్టాడు. కానీ నేను ఇండియాలో తొలి బీటా బేబీకి జన్మనిస్తాను అని అస్సలు అనుకోలేదు. అసలు ఆ విషయమే నాకు తెలియదు. కానీ అదృష్టం మావైపు ఉంది" అని  ఫ్రాంకీ గురించి చెప్పింది తల్లి. ఫ్రాంకీ ఆమెకు రెండో సంతానం. ఆమెకు ఐదేళ్ల కిందట పాప పుట్టింది.

బీటా జనరేషన్ ఎలా ఉంటుంది?

2025-2039 మధ్య పుట్టే పిల్లలను బీటా జనరేషన్ పిల్లలు అంటారు. దీనికి ముందు 2010-2024 వరకూ ఆల్ఫా జనరేషన్ బిడ్డలు పుట్టారు. బీటా జనరేషన్ పిల్లలకు టెక్నాలజీతో ఎక్కువ సంబంధం ఉంటుంది. వారి ప్రపంచం మొత్తం స్మార్ట్ టెక్నాలజీ, స్మార్ట్ కనెక్టివిటీ కలిగివుంటుంది. వీళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, పర్యావరణ ఇన్నోవేషన్లు, వేగంగా మారే ఫ్యూచర్‌ని చూస్తారు. ఎక్కువ డిజిటల్ ప్రపంచాన్ని వీరు చూస్తారు. ఈ జనరేషన్ లో ఎన్నో ఆవిష్కరణలు ఉంటాయి. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) ప్రపంచాన్ని మార్చేస్తోంది. ఈ బీటా జనరేషన్ లో ఎన్నో వింత ఆవిష్కరణలు చూస్తామని వైద్యులు చెబుతున్నారు.