మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోనే ఎక్కువ మరణాలు
న్యూఢిల్లీ: వేట, ఇతర కారణాల వల్ల ఎనిమిదేళ్లలో మన దేశంలో సుమారు 750 పులులు మరణించాయి. వీటిలో మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోనే ఎక్కువ మరణాలు సంభవించాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా 173 పులులు చనిపోయాయి. వీటిలో 369 పులులు సహజ మరణం పొందగా.. 168 వేటకు బలయ్యాయి. 42 టైగర్లు యాక్సిడెంటల్‌గా, ఘర్షణ వల్ల అసహజంగా చనిపోగా, మరో 70 పులుల మరణాలకు కారణాలు తెలుసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 2012–19 మధ్య 101 పెద్ద పులులను అధికారులు స్వాధీనం చేసుకున్నారని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ (ఆర్‌టీఐ)లో ఒక వ్యక్తి అడిగిన ఇన్ఫర్మేషన్ కు నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ రిప్లై ఇచ్చింది. దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, గడిచిన నాలుగేళ్లలో పులుల సంఖ్య 2,226 నుంచి 2,976కు చేరిందని కేంద్రమంత్రి ప్రకాశ్జావదేకర్డిసెంబర్లో చెప్పారు.