అఫ్ఘనిస్తాన్కు భారత్ మరోసారి ఆపన్న హస్తం అందించింది. భూకంపంలో తీవ్రంగా నష్టపోయిన అఫ్ఘనిస్తాన్కు ఇండియా..పరికరాలు, ఇతర సామాగ్రిని పంపించింది. గురువారం రాత్రి ప్రత్యేక విమానంలో పరికరాలు, సహాయ సామాగ్రిని కాబూల్కు తరలించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందరం బాగ్చీ ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ విమానంలో టెక్నికల్ టీమ్ కూడా కాబూల్కు వెళ్లింది. ఈ టీమ్ అఫ్ఘాన్ ప్రజలకు భారత్ చేసిన సాయాన్ని పంపిణీ చేయనుంది. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టాక..తొలిసారి అక్కడి ఇండియన్ ఎంబసీలో మన సిబ్బంది పనిచేయనున్నారు. భారత టెక్నికల్ టీమ్ భద్రతకు తాలిబన్లు హామీ ఇచ్చాకే ఈ బృందం అఫ్ఘనిస్తాన్ కు వెళ్లింది.
India, a true first responder. https://t.co/riXkZlzwxC
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 23, 2022
భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న అఫ్ఘనిస్తాన్ లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో ఇండ్లు ధ్వంసం అయ్యాయి. అఫ్గానిస్థాన్‌లోని జ్ఞాన్ అనే గ్రామం తీవ్రంగా దెబ్బతింది. వేల మంది గాయపడ్డారు. వందల మంది చనిపోయారు. క్షతగాత్రులకు వైద్యసేవలు కరువయ్యాయి. ఆసుపత్రులు ధ్వంసం అయ్యాయి. ఒక ఆసుపత్రికి వందల సంఖ్యలో గాయాలైన వస్తుండగా..వారికి కేవలం ఐదు పడకలే అందుబాటులో ఉన్నాయి. అప్ఘాన్ పరిస్థితులను అర్థం చేసుకున్న భారత్..మానవతా దృక్పథంతో ..భారీ సాయాన్ని అందించింది.
Second consignment of India's earthquake relief assistance for the people of Afghanistan reaches Kabul. pic.twitter.com/S7nDhi0nX4
— Arindam Bagchi (@MEAIndia) June 24, 2022