- 30 టన్నుల అత్యవసర మందులు పంపిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: యుద్ధం కారణంగా అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న పాలస్తీనాకు భారత్ మరోసారి మానవతా సాయం అందించింది. 30 టన్నుల అత్యవసర వైద్య సామగ్రిని పంపించింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు.
‘‘పాలస్తీనాకు మద్దతు కొనసాగుతున్నది. ఇందులో భాగంగానే 30 టన్నుల వైద్య సామగ్రి, ఆహార పదార్థాలను మంగళవారం పంపించాం. ఇందులో మందులు, శస్త్రచికిత్స సామగ్రి, డెంటల్ ప్రొడక్ట్స్, ఎనర్జీ బిస్కెట్స్ ఉన్నాయి” అని చెప్పారు.