బంగాళాఖాతంలో పొడవైన తీరం ఇండియాదే

బంగాళాఖాతంలో  పొడవైన తీరం ఇండియాదే

బ్యాంకాక్: బంగాళాఖాతంలో అత్యంత పొడవైన సముద్ర తీరరేఖ భారత్ సొంతమని  విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్​అన్నారు. గురువారం  బ్యాంకాక్​లో  బిమ్స్​టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్) దేశాల మంత్రుల సమావేశంలో జైశంకర్ పాల్గొన్నారు. 

బంగ్లాదేశ్​ ప్రధాన సలహాదారు మహమ్మద్​ యూనస్​ ఇటీవల చైనా పర్యటనలో  చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్​ ఇచ్చారు. ‘‘ఇండియాకు బంగాళాఖాతంలో  6,500 కి.మీ. పొడవైన తీరరేఖ ఉంది. ఐదు బిమ్స్​టెక్ సభ్య దేశాలతో సరిహద్దులను పంచుకోవడమే కాకుండా, వాటిలో చాలా దేశాలను కనెక్ట్​చేస్తుందన్నారు. 

బంగాళాఖాతం చుట్టూ ఉన్న దేశాలకు కామన్​ ఇంట్రెస్టులు, కామన్ టెన్షన్లు ఉన్నాయి, ఇవన్ని మన చరిత్ర నుంచి పుట్టుకొచ్చాయి”అని అన్నారు.