ప్రపంచంలో అత్యధికంగా ఊబకాయంతో బాధపడుతున్న పిల్లలు కలిగిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని ఓ అధ్యయనంలో తేలింది. దేశంలో దాదాపు కోటి 50 లక్షల మంది చిన్నారులు ఉండాల్సిన బరువుకంటే ఎక్కువగా ఉన్నారని ఆ అధ్యయనం పేర్కొంది.
ఇటీవల జరిగిన మరో అధ్యయనంలో ఊబకాయాన్ని కలిగి ఉన్న తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు 80% మంది ఊబకాయాన్ని కలిగి ఉండగా, సాధారణ బరువును కలిగి ఉన్న తల్లిదండ్రుల పిల్లల్లో 10% ఊబకాయాన్ని కలిగి ఉన్నారు.
ఊబకాయం వలన పలురకాల గుండెజబ్బులు, మధుమేహం ఇంకా శ్వాసకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.ఈ స్థూలకాయం జన్యుపరంగా సంభవించినప్పటికీ సమతుల పోషకాహారం తీసుకుంటూ రోజూ వ్యాయామం చేయడం ద్వారా దానిని నియంత్రించ వచ్చని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న జీవనశైలి కూడా ఇందుకు కారణమవుతోంది. అందుకే పిల్లలను సాయంత్రం పూట బయటి వాతావరణంలో ఆడుకునేలా చేయాలి. దీనివల్ల ఈ ఊబకాయ సమస్య నుంచి బయటపడొచ్చు.
V6 వెలుగు