IND Vs NZ, 1st Test: సొంతగడ్డపై 46 పరుగులకే ఆలౌట్.. ఒక్క మ్యాచ్‌లో ఇన్ని చెత్త రికార్డులా

IND Vs NZ, 1st Test: సొంతగడ్డపై 46 పరుగులకే ఆలౌట్.. ఒక్క మ్యాచ్‌లో ఇన్ని చెత్త రికార్డులా

బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతోన్న మొదటి టెస్ట్​లో భారత క్రికెట్ జట్టు తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో అత్యంత చెత్తగా ఆడింది. కేవలం 46 పరుగులకే ఆలౌటైంది. ఆడుతుంది న్యూజీలాండ్ లోనా లేకపోతే ఇండియాలోఆ అనే అనుమానం కలగక మానదు. సొంతగడ్డపై ఎంతో పటిష్టంగా ఉండే మన జట్టు ఒక్కసారిగా కుప్పకూలడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కోహ్లీ, రోహిత్, రాహుల్, పంత్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్న ఒక జట్టు కనీసం 50 పరుగులైనా చేయకపోవడం విస్మయానికి గురి చేస్తుంది.

న్యూజిలాండ్ పేసర్లు విలియం ఒరోర్కే, హెన్రీ పదునైన పేస్ కు మన దగ్గర సమాధానం లేకుండా పోయింది. హెన్రీ 5 వికెట్లు తీసుకుంటే విలియం ఒరోర్కే నాలుగు వికెట్లు పడగొట్టాడు. సౌథీకి ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో టీమిండియా పలు చెత్త రికార్డ్స్ నమోదు చేసింది. 92 ఏళ్ళ భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. 1987లో వెస్టిండీస్​పై 75 పరుగులు ఆలౌట్ కావడం నిన్నటివరకు టీమిండియా అత్యల్ప స్కోర్ కాగా నేడు భారత్ ఆ రికార్డ్ బ్రేక్ చేసి చెత్త రికార్డ్ ఖాతాలో వేసుకుంది. భారత టెస్ట్  క్రికెట్ చరిత్రలో ఇది మూడో అత్యల్ప స్కోర్.      

ALSO READ | IND Vs NZ, 1st Test: రోహిత్ సేనకు ఏమైందీ.. 46 పరుగులకు ఆలౌట్.. ఐదుగురు డకౌట్

ఓవరాల్ గా భారత్ టెస్ట్ క్రికెట్ టెస్ట్ క్రికెట్ లో ఆస్ట్రేలియాపై అడిలైడ్ లో 36 పరుగులకు ఆలౌటైంది. 2020 ఆస్ట్రేలియా పర్యటనలో ఇది జరిగింది. భారత్ లో జరిగిన అన్ని టెస్ట్ మ్యాచ్ ల్లో కూడా ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో ఈ మ్యాచ్ లో 5 గురు భారత బ్యాటర్లు డకౌటయ్యారు. దీంతో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక డకౌట్లు నమోదు చేసి రెండో స్థానంలో నిలిచింది. 2014 మాంచెస్టర్ లో జరిగిన టెస్టులో 6 గురు భారత ఆటగాళ్లు డకౌటయ్యారు.