IND vs BAN 2nd Test: 3 ఓవర్లకే 50 పరుగులు..కాన్పూర్ టెస్టులో టీమిండియా ప్రపంచ రికార్డ్

IND vs BAN 2nd Test: 3 ఓవర్లకే 50 పరుగులు..కాన్పూర్ టెస్టులో టీమిండియా ప్రపంచ రికార్డ్

కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు టీ20ని తలపిస్తుంది. మ్యాచ్ రేపటితో ముగియనుండటంతో భారత్ బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన మన ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ విధ్వంసకర ఆట తీరుతో భారత్ తొలి మూడు ఓవర్లకే 51 పరుగులు చేసింది. దీంతో భారత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా  50 పరుగుల మార్క్ అందుకున్న జట్టుగా ప్రపంచ రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. 

Also Read:-భారత బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోరుకే బంగ్లా ఆలౌట్

రోహిత్ శర్మ 11 బంతుల్లో 3 సిక్సులు.. ఒక ఫోర్ తో 23 పరుగులు చేసి మెహదీ హసన్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. మరోవైపు జైశ్వాల్ 13 బంతుల్లో 30 పరుగులు చేసి క్రీజ్ లో ఉన్నాడు. నాలుగో రోజు కావడంతో భారత్ ఫలితం కోసం వేగంగా ఆడుతుంది. వర్షం అంతరాయం కలిగించిన తొలి మూడు రోజుల్లో 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. భారత బ్యాటర్లు ఎంత వేగంగా ఆడతారనే దానిపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధార పడి ఉంది. అంతకముందు బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 233 పరుగులకు ఆలౌట్ అయింది.