IND v AFG: ఒక్కడికే ఎందుకిలా..రాహుల్ టీ20 కెరీర్ ముగిసినట్టేనా..?

IND v AFG: ఒక్కడికే ఎందుకిలా..రాహుల్ టీ20 కెరీర్ ముగిసినట్టేనా..?

కేఎల్ రాహుల్ టాలెంట్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ 2023లో గాయం కారణంగా భారత జట్టుకు దూరమైనా రాహుల్..ఆసియా కప్ లో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. అసలు ఫిట్ నెస్ సాధిస్తాడా లేదా అనే పరిస్థితి నుంచి భారత జట్టు మిడిల్ ఆర్డర్ లో కీలక ప్లేయర్ గా మారాడు. వికెట్ కీపర్ గా చక్కగా రాణిస్తూ భవిష్యత్తు స్టార్ ప్లేయర్ గా కితాబులందుకున్నాడు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో యంగ్ జట్టును నడిపించి సఫారీల గడ్డపై సిరీస్ గెలిపించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కు సెలక్టర్లు ఊహించని షాక్ ఇచ్చారు. 

ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు టీ20 సిరీస్ లో భాగంగా రాహుల్ ను పక్కన పెట్టేశారు. 2024 టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా స్థార్ ప్లేయర్లు కోహ్లీ, రోహిత్ ను జట్టులోకి చేర్చిన సెలక్టర్లు రాహుల్ ను మాత్రం పట్టించుకోలేదు. ఓపెనర్లు గా గిల్, జైస్వాల్ ను.. వికెట్ కీపర్ బ్యాటర్ గా జితేష్ శర్మ, శాంసన్ లను ఎంపిక చేసి రాహుల్ కు పెద్ద షాక్ ఇచ్చారు. అయ్యర్, జడేజా, సిరాజ్, బుమ్రాలకు రెస్ట్ ఇచ్చినట్టు ప్రకటించినా రాహుల్ ను ఎందుకు పక్కన పెట్టారో క్లారిటీ లేదు.

2024 టీ20 వరల్డ్ కప్ కు ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే సిరీస్ చివరిది కావడంతో ఈ మెగా టోర్నీకి ఈ కర్ణాటక బ్యాటర్ పేరును పరిశీలించనట్లుగా సెలక్టర్లు భావిస్తున్నట్టు అర్ధమవుతుంది. అదే జరిగితే రాహుల్ టీ20 కెరీర్ ముగియడం గ్యారంటీ. హార్దిక్ పాండ్య, సూర్య కుమార్ యాదవ్ లేకపోయినా రాహుల్ 15 మందిలో స్థానం దక్కించుకోలేకపోయాడంటే భారత జట్టులో ఇకపై టీ20ల్లో కొనసాగటం కష్టమే. 

రాహుల్ చివరిసారి 2022 టీ20 వరల్డ్ కప్ ఆడాడు. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ తర్వాత రాహుల్ భారత టీ20 జట్టులో కనిపించలేదు. వన్డేలు, టెస్టుల్లో  కొనసాగినా..టీ20ల్లో యంగ్ ప్లేయర్లకు అవకాశమిచ్చారు. టీ20 వరల్డ్ కప్ లాంటి మేజర్ టోర్నీకు సెలక్ట్ చేస్తాడననుకున్నా అది జరగలేదు. దీంతో రాహుల్ టీ20 కెరీర్ డైలమాలో పడింది. 2024 సీజన్ ఐపీఎల్ లో రాణిస్తే భారత జట్టులో రాహుల్ కు ఏమైనా అవకాశం దక్కుతుందో చూడాలి.