IND vs IRE: మంధాన, రావల్ మెరుపు సెంచరీలు.. వన్డేల్లో టీమిండియా అత్యధిక స్కోర్

రాజ్ కోట్ వేదికగా ఐర్లాండ్ పై జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో భారత మహిళలు బ్యాటింగ్ లో విజృంభించారు. వచ్చిన వారు వచ్చినట్టు మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో వన్డే చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేశారు. ఓపెనర్లు స్మృతి మంధాన(80 బంతుల్లో 135:12 ఫోర్లు, 7 సిక్సర్లు) ప్రతీక్ రావల్(129 బంతుల్లో 154: 20 ఫోర్లు, ఒక సిక్సర్) భారీ సెంచరీలు కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 435 పరుగుల భారీ స్కోర్ చేసింది.

వన్డేల్లో భారత మహిళలకు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. అంతకముందు  ఇదే సిరీస్ లో రెండో వన్డేలో 370 పరుగులు చేసిన రికార్డును ఆ తర్వాత మ్యాచ్ లోనే బ్రేక్ చేయడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ను ఆరంభం నుంచి ఓపెనర్లు స్మృతి మంధాన,ప్రతీక్ రావల్ ధాటిగా ఆడారు. కుదురుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా బౌండరీల వర్షం కురిపించారు. ముఖ్యంగా స్మృతి తనదిన శైలిలో హిట్టింగ్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లింది. తొలి వికెట్ కు 26 ఓవర్లలోనే ఈ జోడీ 233 పరుగులు జోడించడం విశేషం.

ALSO READ | Virat Kohli: జేబులు గుల్ల చేస్తున్న కోహ్లీ.. రూ.30 మొక్కజొన్న 500 రూపాయలా..!

70 బంతుల్లో సెంచరీ చేసిన స్మృతి మందాన భారత మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేసింది. సెంచరీ తర్వాత ఔటైనా.. రిచా ఘోష్ (59) తో ప్రతీక్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపింది. ఈ క్రమంలో ప్రతీక్ కెరీర్ లో తొలి సెంచరీ పూర్తి చేసుకోగా.. మరో ఎండ్ లో రిచా వేగంగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటైనప్పటికీ అప్పటికే భారత్ భారీ స్కోర్ చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా ప్రెండర్‌గాస్ట్ రెండు వికెట్లు తీసుకుంది.