వరల్డ్ కప్ లో భాగంగా నేడు( అక్టోబర్ 22) భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ తీసుకోగా.. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. ఇక ఈ మ్యాచులో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది గాయపడిన హార్దిక్ పాండ్య స్థానంలో షమీ చోటు దక్కించుకోగా.. శార్దూల ఠాకూర్ స్థానంలో సూర్య కుమార్ యాదవ్ వచ్చాడు. మరోవైపు కివీస్ మాత్రం ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దగుతుంది.
టేబుల్ టాపర్స్ మధ్య జరగనున్న ఈ పోరులో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలవడంతో పాటు సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంటుంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో ఇరు జట్లు విజయం సాధించి అజేయంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో ఆసక్తికరంగా మారింది.
Also Read :- కివీస్‌తో కష్టమే: న్యూజిలాండ్‌కి అనుకూలంగా ధర్మశాల పిచ్
భారత్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ (కెప్టెన్ ), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్ ), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI):
డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్