వరల్డ్ కప్ లో నేటితో లీగ్ మ్యాచ్ లు ముగియనున్నాయి. చివరి మ్యాచ్ లో నేడు (నవంబర్ 12) పటిష్టమైన భారత్ తో పసికూన నెదర్లాండ్స్ తలపడనుంది. ఇప్పటికే సెమీస్ వెళ్లే జట్లేవో తేలిపోవడంతో ఈ మ్యాచ్ టీమిండియాకు ఒక ప్రాక్టీస్ లా ఉపయోగించుకోవాలని భావిస్తుంది . మరో వైపు టోర్నీని విజయంతో ముగించాలని నెదర్లాండ్స్ ఆరాటపడుతుంది. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంటే నెదర్లాండ్స్ చివరిస్థానంలో నిలిచింది. బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది.
భారత్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI):
వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్మాన్, సైబ్రాండ్ ఎంగెల్బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్, వికెట్ కీపర్), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దట్ట్, పాల్ వాన్ మీకెరెన్
IND vs NED | ICC World Cup 2023 | India won the toss and elected to bat first against Netherlands#INDvsNED #ICCCricketWorldCup pic.twitter.com/dDVlVxh857
— Capital TV (@CapitalTVLive) November 12, 2023