T20 World Cup 2024 Final: ఫైనల్లో టాస్ గెలిచిన భారత్.. మార్పులేకుండానే ఇరు జట్లు

T20 World Cup 2024 Final: ఫైనల్లో టాస్ గెలిచిన భారత్.. మార్పులేకుండానే ఇరు జట్లు

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ప్రారంభమైంది. గత రెండు రోజులుగా వర్షం బయపెట్టినా మ్యాచ్ సమయానికి వరుణుడు శాంతించాడు. బార్బడోస్ వేదికగా సౌతాఫ్రికాతో భారత్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటిగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో రోహిత్ సేన ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. తొలిసారి ఫైనల్ కు వచ్చిన సౌతాఫ్రికా వరల్డ్ కప్ టైటిల్ గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది. 2013 లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత మరో ఐసీసీ ట్రోఫీ కోసం సాధించాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి.

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI):

క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ

భారత్ (ప్లేయింగ్ XI):

రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా