IND vs BAN 2024: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న భారత్.. తెలుగు కుర్రాడు అరంగేట్రం

IND vs BAN 2024: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న భారత్.. తెలుగు కుర్రాడు అరంగేట్రం

మూడు మ్యాచ్ ల టీ20 లో సిరీస్ లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమైంది. గ్వాలియర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్ లో స్పీడ్ స్టార్ మయాంక్ యాదవ్ తొలి సారి భారత జట్టులో చోటు సంపాదించారు. మరోవైపు తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డికి ప్లేయింగ్ 11 లో చోటు దక్కింది. మురళీ కార్తీక్ నుంచి మయాంక్.. పార్ధీవ్ పటేల్ నుంచి నితీష్ రెడ్డి క్యాప్ అందుకున్నారు. 

తొలి మ్యాచ్ లో గెలిచి భారత్ శుభారంభం చేయాలని చూస్తుంటే బంగ్లాదేశ్ మాత్రం టీమిండియాకు ఎలాగైనా షాక్ ఇవ్వాలని చూస్తుంది.తిలక్ వర్మ, బిష్ణోయ్, హర్షిత్ రానా, జితేష్ శర్మలకు తుది జట్టులో చోటు లభించలేదు. చాలా సంవత్సరాల తర్వాత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్నాడు.  

భారత్ (ప్లేయింగ్ XI):

అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్

ALSO READ | IRE vs SA: అయ్యో బవుమా..ఐర్లాండ్‌తో చివరి వన్డేకు సఫారీ కెప్టెన్ దూరం

బంగ్లాదేశ్ ప్లేయింగ్ XI:

లిట్టన్ దాస్(వికెట్ కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాం