IND vs ENG: షమీకి నో ఛాన్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

IND vs ENG: షమీకి నో ఛాన్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభయ్యింది. కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు ఏకైక ఫాస్ట్ బౌలర్.. ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు.. ముగ్గురు ఆల్ రౌండర్లతో బరిలోకి దిగుతుంది. టాప్ 4లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ ఆడనున్నారు. రింకూ సింగ్ ఫినిషర్ బాధ్యతలు మోయనున్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ఒక రోజు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. గాయంతో రీ ఎంట్రీ ఇచ్చిన మహమ్మద్ షమీకి ఈ మ్యాచ్ లో చోటు లభించలేదు.     

ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11:

బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, గుస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

భారత ప్లేయింగ్ 11: 

సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి