ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 108 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 108 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల టన్నులకు పైగా  బొగ్గును ఉత్పత్తి చేయగలిగామని  ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇది గర్వించదగ్గ విషయమని, ఎనర్జీ అవసరాలను తీర్చడానికి మన సొంత కాళ్లపై నిలబడుతున్నామని చెప్పారు. కరెంట్ ఉత్పత్తితో పాటు వివిధ ఫ్యాక్టరీలలో బొగ్గును వాడతారు.

2023–24 లో 99.78 కోట్ల టన్నుల బొగ్గును ఇండియా ఉత్పత్తి చేయగా, 2024–25 లో 108 కోట్ల టన్నులను ఉత్పత్తి చేసింది. కోల్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌  కిషన్ రెడ్డి చేసిన సోషల్ మీడియా పోస్ట్‌‌‌‌కు  మోదీ స్పందించారు.  ‘అడ్వాన్స్డ్‌‌‌‌ టెక్నాలజీ, సమర్ధవంతమైన విధానాలతో పర్యావరణానికి హాని చేయకుండా బొగ్గు ఉత్పత్తిని పెంచగలిగాం’ అని కిషన్ రెడ్డి వివరించారు.