హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్ ధమాకా క్వార్టర్ ఫైనల్‌‌‌‌‌‌‌‌కు  హాకీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్ ధమాకా క్వార్టర్ ఫైనల్‌‌‌‌‌‌‌‌కు  హాకీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరుసగా రెండో మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గురి పెట్టిన ఇండియా మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాకీ టీమ్ మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో విజయం సొంతం చేసుకుంది.  మంగళవారం జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా 2–0తో ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరుకుంది.  సూపర్ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనసాగించిన కెప్టెన్ హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ సింగ్ 11, 19వ నిమిషాల్లో రెండు గోల్స్ కొట్టి జట్టును గెలిపించాడు. తొలుత పెనాల్టీ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మలచిన అతను.. ఇంకో పెనాల్టీ కార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా ఫలితం రాబట్టి జట్టుకు కీలక విజయం అందించాడు.   గత రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు భిన్నంగా చిన్న ప్రత్యర్థి అయిన ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇండియా దూకుడుగా ఆడింది.

రెండో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాబట్టింది. హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ సింగ్ దీన్ని వేస్ట్ చేసినా.. 11వ నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జట్టుకు ఆధిక్యం అందించాడు. కొన్ని నిమిషాల తర్వాత వెంటవెంటనే రెండు పెనాల్టీ కార్నర్లు లభించగా.. రెండో ప్రయత్నంలో బంతిని నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి కొట్టిన హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. అయితే, ఇండియా డిఫెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొన్ని లోపాలు కనిపించాయి. అయితే, మరో  మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో అర్జెంటీనా 2–0తో   న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ను ఓడించడంతో ఇండియా నాకౌట్ బెర్తు ఖాయమైంది. మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో రెండు విజయాలు, ఓ డ్రాతో హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేన ప్రస్తుతం 7 పాయింట్లతో నిలిచింది.    టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌4లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధిస్తాయి.