పెర్త్ : పారిస్ ఒలింపిక్స్ ప్రిపరేషన్స్‌లో ఉన్న ఇండియా హాకీ టీమ్.. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో బోణీ చేయలేకపోయింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండియా 1–5తో ఆసీస్ చేతిలో ఓడింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారూలు 1–0 లీడ్‌లో నిలిచారు. టామ్ విక్‌హమ్ (20, 38వ ని.), టిమ్ బ్రాండ్ (3వ ని.), జోయెల్ రింటాలా (37వ ని.) ఫ్లిన్ ఓగ్లివి (57వ ని.) ఆసీస్‌కు గోల్స్ అందించారు.
గుర్జాంత్ సింగ్ (47వ ని.) ఇండియా తరఫున ఏకైక గోల్ కొట్టాడు. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు మంచి నియంత్రణతో ఆడిన ఆసీస్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. మూడో క్వార్టర్స్‌లో ఎటాకింగ్ గేమ్ ఆడిన గుర్జాంత్ డి ఏరియా నుంచి కొట్టిన బలమైన షాట్ గోల్ పోస్ట్‌లోకి దూసుకుపోయింది. ఆ తర్వాత గోల్స్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇండియా సక్సెస్ కాలేదు.