
న్యూఢిల్లీ : జర్మనీతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇండియా హాకీ టీమ్ ఓటమితో ఆరంభించింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 0–2తో జర్మనీ చేతిలో ఓడింది. హెన్రిక్ మార్ట్‌జెన్స్ (4వ ని), కెప్టెన్ లుకాస్ విండ్‌ఫెడర్ (30వ ని) జర్మనీకి గోల్స్ అందించారు. 2014 తర్వాత మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా ప్లేయర్లు స్టార్టింగ్ నుంచే తడబడ్డారు.
బంతిపై పట్టు సాధించడంలో విఫలమై గోల్స్ చేసే చాన్స్‌ను సృష్టించుకోలేకపోయారు. ఇక ఆరంభం నుంచే వ్యూహాత్మకంగా ఆడిన జర్మనీ ఫార్వర్డ్స్ నాలుగో నిమిషంలోనే ఇండియన్ డిఫెన్స్‌ను ఛేదించింది. కెప్టెన్ లుకాస్ లెఫ్ట్ ఫ్లాంక్ నుంచి రెండో గోల్ కొట్టాడు. ఇండియా ఎంత పోరాడినా గోల్ చేయలేకపోయింది.