జపాన్‎ను చిత్తు చేసిన ఇండియా.. టోర్నీలో వరుసగా రెండో విజయం

జపాన్‎ను చిత్తు చేసిన ఇండియా.. టోర్నీలో వరుసగా రెండో విజయం

హులుంబియుర్ (చైనా): ఆసియా చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌ఇండియా వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో 5–1తో జపాన్‌ను చిత్తుగా ఓడించింది. ఆరంభం నుంచే అదరగొట్టిన  ఇండియా వరుస గోల్స్‌తో విజృంభించింది.  సుఖ్‌‌‌‌‌‌‌జీత్‌‌‌‌‌‌సింగ్‌ 2, 60వ నిమిషాల్లో డబుల్ గోల్స్‌తో సత్తా చాటాడు. అభిషేక్ (3వ నిమిషం), సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(17వ ని), ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌సింగ్ (54వ ని) తలో గోల్‌‌‌‌‌‌‌‌‌‌కొట్టారు. జపాన్ తరఫున కజుమాస 41వ నిమిషంలో ఏకైక గోల్‌‌‌‌‌‌‌‌చేశాడు. బుధవారం మలేసియాతో ఇండియా పోటీపడనుంది.