
ఇన్నాళ్లు ఆ దేశం.. ఈ దేశంపై సుంకాలు పెంచుతూ బెదిరిస్తూ వస్తున్న అమెరికాకు షాక్.. అదే స్థాయిలో మిగతా దేశాలు సుంకాలు పెంచుతూ ఉండటంతో.. అధ్యక్షుడు ట్రంప్ గిలగిలాకొట్టుకుంటున్నారు. అన్ని దేశాలు అమెరికా బాటలోనే అమెరికా ఉత్పత్తులపై సుంకాలను పెంచుతుండటంతో.. ఇప్పుడు అమెరికానే దిగి వస్తుంది. ఈ క్రమంలోనే అమెరికా వైట్ హౌస్ అధికారి మాట్లాడుతూ.. ఆయా దేశాలు అమెరికా ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలను వివరిస్తూ వచ్చారు..
భారతదేశం గురించి ప్రస్తావిస్తూ.. అమెరికా ఉత్పత్తులను దిగుమతి చేసుకునే ఇండియా భారీ సుంకాలను విధిస్తుందని.. అమెరికా మద్యం.. లిక్కర్ పై 150 శాతం సుంకం విధిస్తుండగా.. వ్యవసాయ ఉత్పత్తులపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు చిట్టా చదివి వినిపించారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్..
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టి నాటి నుంచి ప్రపంచ దేశాల్లో ‘టారిఫ్స్’ (సుంకాలు) అంశం హాట్ టాపిక్‌గా మారింది. వచ్చి రావడంతోనే ట్రంప్ వివిధ దేశాలపై భారీగా సుంకాలు విధించారు. కెనడా, చైనా, మెక్సికో వంటి దేశాల దిగుమతులపై టారిఫ్స్‌ను భారీగా పెంచేశాడు. ఇదే విధంగా.. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు వసూల్ చేస్తోన్న దేశాలపై మేం కూడా అదే రీతిలో టారిఫ్స్ విధిస్తామని ఓపెన్‌గా చెప్పాడు ట్రంప్. ఈ నేపథ్యంలో అమెరికా ప్రొడక్ట్స్‌పై వివిధ దేశాలు విధిస్తోన్న టారిఫ్స్‌పై వైట్ వైస్ బుధవారం (మార్చి 12) రివ్యూ నిర్వహించింది.
ఈ సమావేశంలో అమెరికా ఉత్పత్తులపై ఏయే దేశాలు ఎంత మేరకు సుంకాలు విధిస్తున్నాయన్ని జాబితా రెడీ చేశారు అధికారులు. ఈ లిస్ట్ ప్రకారం ఆయా దేశాల దిగుమతులపై కూడా అదే రేంజ్లో టారిఫ్స్ పెంచేందుకు వైట్ హౌజ్ సిద్ధం అయ్యింది. ఈ సందర్భంగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాపై ఏయే దేశాలు ఎక్కువ సుంకాలు విధిస్తున్నాయన్న వివరాలను ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా కెనడాపై ఆమె విరుచుకుపడ్డారు. అమెరికా ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తూ దశాబ్దాలుగా అమెరికా సంయుక్త రాష్ట్రాలను, కష్టపడి పనిచేసే అమెరికన్లను కెనడా దోచుకుంటుందని నిప్పులు చెరిగారు.
ALSO READ | నిరుద్యోగులకు కొత్త స్కీం.. అర్హతను బట్టి రూ.3 లక్షలు.. మార్చి 15 నుంచి దరఖాస్తులు: భట్టీ
ఈ క్రమంలోనే భారత్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు కరోలిన్ లీవిట్. భారత్ కూడా కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారీగా టారిఫ్స్ విధిస్తోందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమెరికన్ మద్యంపై 150 శాతం, వ్యవసాయ ఉత్పత్తులపై 100 శాతం సుంకం విధించడాన్ని ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పరం సహకరించుకోవాలని, న్యాయమైన మరియు సమతుల్య వాణిజ్య పద్ధతులను కోరుకుంటారని ఆమె స్పష్టం చేశారు.
అమెరికన్ వ్యాపారం, కార్మికుల ప్రయోజనాలకు ఆయన ప్రాధాన్యత ఇస్తారని పేర్కొంది లివీట్. రెండో సారి ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ప్రధాని మోడీ అమెరికా వెళ్లి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల వాణిజ్య సంబంధాలపై చర్చించారు. ఈ భేటీలో అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించేందుకు భారత్ ఒప్పుకుందని స్వయంగా ట్రంప్ పేర్కొన్నారు. ఈ తరుణంలో వైట్ హౌస్ సెక్రటరీ భారత సుంకాలపై అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.