తొమ్మిదోసారి అండర్‌‌‌‌‌‌‌‌-19 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ఇండియా

  •     సెమీస్‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికాపై 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ
  •     గెలిపించిన ఉదయ్‌‌‌‌‌‌‌‌, సచిన్‌‌‌‌‌‌‌‌ 

బెనోని: అండర్‌‌‌‌–19 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో యంగ్‌‌‌‌ ఇండియా అద్భుతం చేసింది. 32 రన్స్‌‌‌‌కే 4 కీలక వికెట్లు కోల్పోయినా.. సచిన్‌‌‌‌ దాస్‌‌‌‌ (95 బాల్స్‌‌‌‌లో 11 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 96), కెప్టెన్‌‌‌‌ ఉదయ్‌‌‌‌ సహరన్‌‌‌‌ (124 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లతో 81) పోరాట స్ఫూర్తి చూపెట్టారు. విజృంభిస్తున్న సౌతాఫ్రికా బౌలింగ్‌‌‌‌కు కళ్లెం వేస్తూ.. వీరోచిత బ్యాటింగ్‌‌‌‌తో ఇండియాను తొమ్మిదోసారి ఫైనల్‌‌‌‌కు చేర్చారు.

ఈ ఇద్దరు ఐదో వికెట్‌‌‌‌కు 171 రన్స్‌‌‌‌ జోడించడంతో.. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 2 వికెట్ల తేడాతో ప్రొటీస్‌‌‌‌పై నెగ్గింది. టాస్‌‌‌‌ ఓడిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 244/7 స్కోరు చేసింది. లుహాన్‌‌‌‌ డ్రి ప్రిటోరియస్‌‌‌‌ (102 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 76), రిచర్డ్‌‌‌‌ సెలెట్స్‌‌‌‌వానె (100 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 64) రాణించారు. తర్వాత ఇండియా 48.5 ఓవర్లలో 248/8 స్కోరు చేసి గెలిచింది. ఉదయ్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఈ టోర్నీలో ఇండియా వరుసగా ఐదోసారి ఫైనల్ చేరడం విశేషం. గురువారం ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య మరో సెమీస్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుతో ఆదివారం జరిగే ఫైనల్లో ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది.

171 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్

ఛేజింగ్‌‌‌‌లో ఇండియాకు శుభారంభం దక్కలేదు. క్వెనా ఎంపక (3/32), ట్రిస్టాన్‌‌‌‌ లుస్‌‌‌‌ (3/37) రెండు వైపుల నుంచి ఎదురుదాడికి దిగడంతో 12 ఓవర్లలోనే ఆదర్ష్‌‌‌‌ సింగ్‌‌‌‌ (0), ముషీర్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (4), అర్షిన్‌‌‌‌ కులకర్ణి (12), ప్రియాన్షు మోలియా (5) పెవిలియన్‌‌‌‌కు చేరారు. ఫలితంగా 32/4 స్కోరు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టీమిండియాను ఉదయ్‌‌‌‌, సచిన్‌‌‌‌ ఆదుకున్నారు.

పిచ్‌‌‌‌పై బంతి బాగా స్వింగ్‌‌‌‌ అవడంతో ఉదయ్ జాగ్రత్తగా ఆడాడు. మరో ఎండ్‌లో వేగంగా ఆడిన సచిన్‌‌‌‌ వరుస బౌండ్రీలతో హోరెత్తించాడు. ఈ జోడీని విడగొట్టేందుకు సఫారీ కెప్టెన్‌‌‌‌ జేమ్స్‌‌‌‌ బౌలర్లను మార్చినా ప్రయోజనం దక్కలేదు. ఈ క్రమంలో దాస్, ఉదయ్ ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. 96 రన్స్‌‌‌‌ వద్ద సచిన్‌‌‌‌ సింపుల్‌‌‌‌ క్యాచ్‌‌‌‌ ఇవ్వడంతో సెంచరీ మిస్సయ్యింది. కొద్దిసేపటికే అవనీశ్‌‌‌‌ (10), మురుగన్‌‌‌‌ అభిషేక్‌‌‌‌ (0) వికెట్లు పడటంతో ఇండియా టీమ్‌లో కాస్త టెన్షన్ మొదలైంది. కానీ, రాజ్‌‌‌‌ లింబానీ (13 నాటౌట్‌‌‌‌)తో కలిసి ఉదయ్‌‌‌‌ టీమ్‌ను గెలిపించాడు. 

ఇద్దరే ఆడిన్రు..

ఆరంభంలో సౌతాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేసిన ఇండియా బౌలర్లు చివర్లో ధారాళంగా రన్స్‌‌‌‌ ఇచ్చుకున్నారు. పేసర్‌‌‌‌ లింబానీ (3/60) దెబ్బకు ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌ ఓవర్స్‌‌‌‌లోనే  స్టీవ్‌‌‌‌ స్టోల్క్‌‌‌‌ (14), టీగర్‌‌‌‌ (0) పెవిలియన్‌‌‌‌కు చేరారు. దీంతో 46/2 స్కోరుతో కష్టాల్లో పడిన సఫారీ టీమ్‌‌‌‌ను ప్రిటోరియస్‌‌‌‌, రిచర్డ్‌‌‌‌ గట్టెక్కించారు. మధ్యలో స్పిన్‌‌‌‌ త్రయం సౌమీ పాండే (1/38), ముషీర్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (2/43), ప్రియాన్షు ఆకట్టుకున్నారు. మంచి టర్నింగ్‌‌‌‌ బాల్స్‌‌‌‌తో ప్రిటోరియన్‌‌‌‌, రిచర్డ్‌‌‌‌ను ఇబ్బంది పెట్టారు. మోలియా బౌలింగ్‌‌‌‌లో సిక్స్‌‌‌‌ కొట్టిన ప్రిటోరియస్‌‌‌‌ 59 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ సాధించాడు.

31వ ఓవర్‌‌‌‌లో ముషీర్‌‌‌‌ బాల్‌‌‌‌ను మిడ్‌‌‌‌ వికెట్‌‌‌‌ మీదుగా భారీ షాట్‌‌‌‌ ఆడగా బౌండ్రీ వద్ద అభిషేక్‌‌‌‌ స్టన్నింగ్‌‌‌‌ క్యాచ్‌‌‌‌ అందుకున్నాడు. దాంతో  మూడో వికెట్‌‌‌‌కు 72 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. కొద్దిసేపటికే రిచర్డ్‌‌‌‌ 90 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేయగా, రెండో ఎండ్‌‌‌‌లో వైట్‌‌‌‌హెడ్‌‌‌‌ (22) ఫర్వాలేదనిపించాడు. నాలుగో వికెట్‌‌‌‌కు 45 రన్స్‌‌‌‌ జత చేసి వెనుదిరిగాడు. ఆ వెంటనే మరైస్‌‌‌‌ (3) ఔటైనా, చివర్లో జువాన్‌‌‌‌ (24), ట్రిస్టాన్‌‌‌‌ లుస్‌‌‌‌ (23 నాటౌట్‌‌‌‌), రిలే నోర్టన్‌‌‌‌ (7 నాటౌట్‌‌‌‌) టీమ్‌కు కీలక రన్స్‌  అందించారు.

ఉదయ్‌‌‌‌, సచిన్‌‌‌‌ ఐదో వికెట్‌‌‌‌కు నెలకొల్పిన భాగస్వామ్యం యూత్‌‌‌‌ వన్డేల్లో అత్యుత్తమం. బంగ్లాదేశ్​ క్రికెటర్లు తౌహిద్‌‌‌‌ హృదయ్‌‌‌‌, షామిమ్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ పేరిట ఉన్న161 రన్స్‌‌‌‌ రికార్డును అధిగమించారు. 

ALSO READ: మరో 60 గ్రూప్ 1 పోస్టులు.. భర్తీకి ప్రభుత్వం అనుమతి

సంక్షిప్త స్కోర్లు
సౌతాఫ్రికా: 50 ఓవర్లలో 244/7 (లుహాన్‌‌‌‌‌‌‌‌ ప్రిటోరియస్‌‌‌‌‌‌‌‌ 76, రిచర్డ్‌‌‌‌‌‌‌‌ సెలెట్స్‌‌‌‌‌‌‌‌వానె 64, రాజ్‌‌‌‌‌‌‌‌ లింబానీ 3/60). ఇండియా: 48.5 ఓవర్లలో 248/5 (సచిన్‌‌‌‌‌‌‌‌ దాస్ 96, ఉదయ్‌‌‌‌‌‌‌‌ 81, క్వెనా 3/32, లుస్‌‌‌‌‌‌‌‌ 3/37).