కాన్స్ ఇంటర్నేషనల్ ఓపెన్‌‌‌‌‌‌‌‌ చెస్ టోర్నమెంట్‌.. కాన్స్ చెస్‌‌‌‌‌‌‌‌ విన్నర్ ఇనియన్‌‌‌‌‌‌‌‌

కాన్స్ ఇంటర్నేషనల్ ఓపెన్‌‌‌‌‌‌‌‌ చెస్ టోర్నమెంట్‌.. కాన్స్ చెస్‌‌‌‌‌‌‌‌ విన్నర్ ఇనియన్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌మాస్టర్ ఇనియన్  కాన్స్ ఇంటర్నేషనల్ ఓపెన్‌‌‌‌‌‌‌‌ చెస్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో విజేతగా నిలిచాడు.  ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌లోని కాన్స్‌‌‌‌‌‌‌‌లో సోమవారం జరిగిన తొమ్మిదో, చివరి రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఇండియాకే చెందిన వి. ప్రణేష్‌‌‌‌‌‌‌‌పై విజయం సాధించిన ఇనియన్ అత్యధికంగా 7.5 పాయింట్లతో టైటిల్‌‌‌‌‌‌‌‌ నెగ్గాడు. ఢిల్లీకి చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ ఆరాధ్య గార్గ్ 7 పాయింట్లతో రన్నరప్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. ఈ టోర్నీలో ఆరు విజయాలు, మూడు డ్రాలతో అజేయంగా నిలిచిన ఇనియన్ తన రేటింగ్‌‌‌‌‌‌‌‌ను 2579కి పెంచుకొని 2600 ఎలో మార్క్‌‌‌‌‌‌‌‌కు చేరువయ్యాడు.