- మంధాన, హర్లీన్, జెమీమాపై భారీ ఆశలు
- తొలి విజయం కోసం ఐర్లాండ్ ప్రయత్నాలు
- ఉ. 11 నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో
రాజ్‌కోట్ : వెస్టిండీస్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లను సొంతం చేసుకున్న ఇండియా విమెన్స్ టీమ్.. ఐర్లాండ్‌తో తొలి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌కు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు రెస్ట్ ఇవ్వడంతో స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన టీమ్‌ను నడిపించనుంది. విండీస్‌తో జరిగిన రెండు సిరీస్‌ల్లో కలిపి మంధాన 341 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆరు మ్యాచ్‌ల్లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు సాధించింది.
దీంతో ఈ సిరీస్‌లోనూ ఇండియా బ్యాటింగ్ భారం మరోసారి మంధానాపైనే పడనుంది. అదే టైమ్‌లో హర్లీన్ డియోల్, ప్రతీకా రావల్, జెమీమా రొడ్రిగ్స్ కూడా బ్యాటింగ్ భారం పంచుకోవాల్సి ఉంటుంది. కరీబియన్లపై రాణించిన ఈ త్రయం మరోసారి చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు. బౌలింగ్‌లో రేణుకా సింగ్ లేకపోవడం కొంత మైనస్‌గా కనిపిస్తున్నా.. టిటాస్ సాధూ, సైమా ఠాకూర్ తమ మార్క్ బౌలింగ్ చూపిస్తే ఇబ్బందులు తప్పినట్లే. డొమెస్టిక్‌తో పాటు ఇటీవల ఆడిన ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో సాధూ పేస్, స్వింగ్‌తో ఆకట్టుకుంది.
ఆడిన ఎనిమిది వన్డేల్లో సైమా 7 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉంది. వైస్ కెప్టెన్, ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ అత్యంత కీలకం కానుంది. విండీస్‌తో మూడో వన్డేలో కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ చేసిన దీప్తి (6/31) ఆ స్థాయిలో మరోసారి చెలరేగాలని యోచిస్తోంది. ప్రియా మిశ్రా, తనుజా కన్వర్.. దీప్తికి అండగా నిలవాలి. ఆల్‌రౌండర్స్ రాఘవి బిస్త్, సయాలీపై కూడా భారీ ఆశలు ఉన్నాయి. దూకుడైన బ్యాటింగ్‌తో పాటు మెరుపు ఫీల్డింగ్ చేయడంలో బిస్త్ మంచి దిట్ట. జట్టులో చోటును సుస్థిరం చేసుకోవడానికి ఈ సిరీస్‌ను మంచి అవకాశంగా భావిస్తోంది.
తొలి గెలుపు కోసం..
మరోవైపు ఇండియాతో ఇదే తొలి సిరీస్ కావడంతో ఐర్లాండ్ కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అయితే సొంతగడ్డపై ఇండియాను ఓడించాలంటే అనుభవంతో పాటు హిట్టింగ్ ప్లేయర్ల అవసరం చాలా ఉంది. గ్యాబీ లూయిస్ నేతృత్వంలోని ఐర్లాండ్ టీమ్‌లో నాణ్యమైన ఆల్‌రౌండర్లకు కొదవలేకపోయినా ఎక్స్‌పీరియెన్స్ అంతగా లేదు. అయితే ఆల్‌రౌండర్ ఓర్లా ప్రిండెర్‌గాస్ట్‌పై ఎక్కువ అంచనాలున్నాయి.
డబ్ల్యూబీబీఎల్, ఆసీస్‌లో ఆడిన అనుభవం ఆమె సొంతం. ఈమె ఇండియాకు గట్టి పోటీ ఇస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఇండియాతో ఇప్పటి వరకు ఆడిన 12 వన్డేల్లో ఐర్లాండ్ ఒక్క మ్యాచ్‌లోనూ నెగ్గలేదు. చివరిసారిగా 2023 టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన మ్యాచ్‌లో ఇండియా 5 రన్స్ తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది.