ఇండియా ఓ స్వర్గం.. పాక్​కు వెళ్లని అదృష్టవంతుల్లో నేనొకడిని

  • ఇండియా ఓ స్వర్గం
  • పాక్​కు వెళ్లని అదృష్టవంతుల్లో నేనొకడిని: ఆజాద్

న్యూఢిల్లీ: పాకిస్థాన్​కు వెళ్లని అదృష్టవంతుల్లో తానూ ఒకడినని గులాంనబీ ఆజాద్​ అన్నారు. హిందుస్థానీ ముస్లింనని చెప్పుకునేందుకు గర్వపడుతున్నానన్నారు. ఈనెల 15న ఆయన పదవీ కాలం ముగియనుండడంతో మంగళవారం రాజ్యసభలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ఆజాద్ మాట్లాడారు. ఇండియా ఓ స్వర్గమన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తాను పుట్టానని, పాక్​లో ఘటనలను చూసి, ఇండియన్​ ముస్లింని అయినందుకు గర్వపడుతున్నానని అన్నారు. 2007లో జమ్మూకాశ్మీర్​ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన టెర్రర్​ ఎటాక్​ను గుర్తు చేస్తూ.. లోయలో టెర్రరిజం అంతమవ్వాలని దేవుడిని మొక్కుకుంటున్నానని చెప్పారు. మిగతా ముస్లిందేశాల్లోని ముస్లింలు తమలో తామే కొట్టుకుని చస్తున్నారు. ఒక్క ఇండియాలోనే అంతా కలిసిమెలిసి ఉంటున్నారని ఆజాద్​ చెప్పారు. ప్రపంచంలో గొప్ప ముస్లిం ఎవరని అంటే.. ఇండియన్​ ముస్లింలేనని అన్నారు. అఫ్గానిస్తాన్​​ నుంచి ఇరాక్​ దాకా ముస్లిం దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందేనన్నారు.

అటల్​ జీ నుంచి ఎంతో నేర్చుకున్నా

పార్లమెంట్​ జీవితం తనకెన్నో విషయాలు నేర్పిందని ఆజాద్​ చెప్పారు. ఇందిరా గాంధీ, రాజీవ్​ గాంధీల పాలన చూసి తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. బీజేపీతో కాకుండా మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయితో ఎలా మాట్లాడేవారో తమకు ఇందిరా గాంధీ ఎప్పుడూ చెబుతుండేవారన్నారు. ప్రతిపక్ష నేతగా ఎలా ఉండాలో అటల్​ జీ నుంచే నేర్చుకున్నానని చెప్పారు. అవలీలగా ఆయన తన బాధ్యతలను నెరవేర్చారన్నారు.

For More News..

ఐపీఎల్‌కు ‘వివో’ గుడ్‌ బై!

దేశంలో పాగా వేయనున్న బిట్‌కాయిన్‌?

టెస్ట్ ర్యాంకింగ్స్‌‌లో నాలుగో ప్లేస్‌కి పడిపోయిన ఇండియా