స్పోర్ట్స్​ దేశంగా భారత్

ఇండియాలో ఒక క్రీడాకారిణిగా నా జీవితాన్ని ప్రారంభించడం, ప్రస్తుతం ఇండియన్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌కు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఉండడం ఇవన్నీ గమనించినపుడు నాలో ఒకరకమైన సంతృప్తి, గర్వం కలుగుతాయి. గత తొమ్మిది సంవత్సరాలలో,  ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి దార్శనిక నాయకత్వంలో క్రీడల రంగంలో అద్భుతమైన మార్పు సంభవించింది.   మౌలిక సదుపాయాల అభివృద్ధి నుంచి, ప్రత్యేక దృష్టితో శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, క్రీడలకు నిధుల పెంపు వంటి వాటి వల్ల మన దేశం మున్నెన్నడూ లేనంతగా క్రీడాంశాలలో విజయాలు సాధిస్తూ వస్తోంది. 

భారత క్రీడా రంగంలో వచ్చిన ఈ  సానుకూల మార్పుకు చెప్పుకోదగిన గుర్తు, మహిళా క్రీడాకారిణులు చూపిన ప్రతిభ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, అణగారిన వర్గాల నేపథ్యం నుంచి వచ్చిన మహిళా క్రీడాకారిణులు చూపిన ప్రతిభ చెప్పుకోదగినది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఈ మహిళలు తిరుగులేని పట్టుదలతో, తమ ప్రతిభను ప్రదర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో వారు అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌, హాకీ, బాడ్మింటన్‌‌‌‌‌‌‌‌, టేబుల్‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌, వంటి అనేక ఇతర క్రీడాంశాలలో అద్భుత విజయాలు సాధించి చూపడం, ఇది వారిలోని అద్భుత స్ఫూర్తికి, తిరుగులేని పట్టుదలకు నిదర్శనం.

క్రీడల పట్ల ప్రధాని చొరవ

ప్రధానమంత్రి, క్రీడాకారులతో వ్యక్తిగతంగా పరిచ యం ఏర్పరచుకోవడం నిజంగా ఎంతో ప్రేరణాత్మకమైనది. క్రీడాకారులకు  వారు అందిస్తున్న మద్దతు, క్రీడాకారుల నిజమైన బాగు కోసం వారు చూపుతున్న శ్రద్ధ ఎంతో విలువైనది.  క్రీడాకారులను ప్రధాని కలిసినపుడు వారిని ప్రోత్సహిస్తూ .. చెప్పేమాటలు వారి ప్రగతి పట్ల వారికి ఉన్న ఆసక్తి, అవన్నీ క్రీడాకారుల్లో గౌరవం, బాధ్యతను పెంచాయి.  ఈ అనుబంధం, భారతీయ క్రీడాకారులలో ఆత్మవిశ్వాసాన్ని, విజయం సాధిస్తామన్న ధీమాను పెంచాయి. క్రీడాకారులు సాధించిన విజయం వెనుక క్రీడలకు భారత ప్రభుత్వం పెంచిన బడ్జెట్​ కేటాయింపులూ ఉన్నాయి. ఉత్తమ మౌలిక సదుపాయాలు, మెరుగైన శిక్షణ,  క్రీడాకారుల సంక్షేమానికి వీలు కలిగింది. నిధుల కేటాయింపు పెరుగుదలతో ఉన్నత స్థాయిలో పోటీపడడానికి, కేవలం ఆయా క్రీడల్లో రాణించడంపైనే క్రీడాకారులు దృష్టి పెట్టి ప్రతిభ కనబరచడానికి వీలు కలిగింది.

ఖేలో ఇండియా..

దేశంలో క్రీడల సంస్కృతిని పెంపొందించడానికి, క్షేత్ర స్థాయిలో క్రీడలకు సంబంధించి గట్టి పునాది వేయడానికి ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం ఎంతగానో దోహదపడింది. ఈ కార్యక్రమం,  క్రీడాకారులను ప్రోత్సహించడమే కాక, యువ క్రీడాకారులకు కీలకమద్దతును , మార్గనిర్దేశాన్ని అందించింది. అంతర్‌‌‌‌‌‌‌‌ పాఠశాలల, అంతర్‌‌‌‌‌‌‌‌ కళాశాలల పోటీలను నిర్వహించడం ద్వారా ఖేలో ఇండియా.. దేశం నలుమూలల నుంచి మరుగున పడి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి దోహదపడింది. ఈ కార్యక్రమం యువ క్రీడాకారుల్లో విశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, గొప్పగా కలలుకనడానికి ఒక వేదికను సమకూర్చింది. ఇది యువతలో క్రీడలపట్ల ఆసక్తి పెంచడంతో పాటు, భవిష్యత్‌‌‌‌‌‌‌‌ ఛాంపియన్లుగా ఎదగడానికి ఎంతో దోహదపడింది.

ఫిట్​ ఇండియా..

ప్రధానమంత్రి ప్రారంభించిన ‘ఫిట్‌‌‌‌‌‌‌‌ ఇండియా’ కార్యక్రమం, దేశ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌, ఆరోగ్య సంరక్షణ రూపురేఖలనే మార్చివేయడంలో గొప్ప చోదక శక్తిగా నిలిచింది. చురుకైన జీవన విధానం ప్రాధాన్యతను నొక్కిచెబుతూ ఈ ఫిట్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఉద్యమం కోట్లాది మంది భారతీయులను క్రీడలవైపు మళ్లించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకునేలా చేసింది. మెరుగైన శరీర దారుఢ్యం కలిగిన, ఆరోగ్యవంతమైన ప్రజలతో కూడిన దేశం దిశగా దీనితో మార్పు వచ్చింది. ఇది మన క్రీడాకారుల విజయానికి నేరుగా  తోడ్పడింది.

టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ పోడియం స్కీమ్‌‌‌‌‌‌‌‌

భారతీయ క్రీడలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన , ప్రభావం చూపిన వాటిలో అత్యంత ముఖ్యమైనది, టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌  పోడియం స్కీమ్‌‌‌‌‌‌‌‌.  టీఓపీఎస్‌‌‌‌‌‌‌‌ పథకం అమలు ఒక గేమ్‌‌‌‌‌‌‌‌ఛేంజర్‌‌‌‌‌‌‌‌ గా చెప్పుకోవచ్చు. ఇది దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం, ప్రేరణనిస్తుంది. ఈ పథకం ద్వారా క్రీడాకారులు ప్రపంచశ్రేణి  శిక్షణ పొందుతారు. ప్రత్యేక శిక్షణ, ఆర్థిక మద్దతు, అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి అవసరమైన అన్ని వనరులూ సమకూరుస్తారు.

దేశానికి క్రీడలు బలమైన ఉపకరణం

దేశ సామాజిక ఆర్థిక పురోభివృద్ధికి క్రీడలు ఒక బలమైన ఉపకరణంగా నేను ఎల్లప్పుడూ విశ్వసిస్తాను. భారతీయ యువత క్రీడలవైపు మొగ్గుచూపితే ఇది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే దేశ నిర్మాణానికి తోడ్పడుతుంది. ఇండియన్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ 9 ఏండ్ల విజయవంతమైన పాలనను పూర్తి చేసుకున్న ప్రధాని మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వంతో కలిసి మన దేశ యువత మరిన్ని క్రీడల్లో పాల్గొనేలా చేయడానికి కృషి చేస్తుంది. మనం ఒక దేశంగా లక్ష్యానికి చేరువయ్యేందుకు ముందడుగు వేద్దాం.

నేషనల్‌‌‌‌‌‌‌‌ సెంటర్స్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఎక్స్​లెన్స్‌‌‌‌‌‌‌‌ 

ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్‌‌‌‌‌‌‌‌ సెంటర్స్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఎక్స్​లెన్స్‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌ సీవోఈలు) ఇండియాలో క్రీడారంగ రూపురేఖలలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చాయి. ఈ కేంద్రాలు,అత్యాధునాతన మౌలిక సదుపాయాలతో, ఆధునిక శిక్షణ సదుపాయాలతో, అత్యున్నతస్థాయి క్రీడా శిక్షకులు, సహాయక సిబ్బందితో  ఇవి రూపుదిద్దుకున్నాయి.  ఈ కేంద్రాలలో క్రీడాకారులకు ప్రపంచశ్రేణి శిక్షణ లభిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలను వారికి పరిచయం చేయడం జరుగుతుంది. ఇది క్రీడాకారుల అభివృద్ధికి, తమ శక్తిసామర్ధ్యాలను అంచనా వేసుకోవడానికి  ఎంతగానో ఉపయోగపడుతోంది.

 క్రీడలపై ప్రధానమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, క్రీడల అభివృద్ధి విషయంలో ప్రభుత్వం సమగ్ర దృష్టి వంటి వాటివల్ల ఇండియా అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మునుపెన్నడూ లేని విజయాలు సాధించింది. మన క్రీడాకారులు కొత్త రికార్డులు నెలకొల్పారు. ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో, ఏసియన్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో, కామన్‌‌‌‌‌‌‌‌వెల్త్‌‌‌‌‌‌‌‌ క్రీడలలో, వరల్డ్‌‌‌‌‌‌‌‌ ఛాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌ లలో మెడల్స్‌‌‌‌‌‌‌‌ సాధించడమే కాక, రికార్డులు నెలకొల్పారు. భారతీయ క్రీడలు అంతర్జాతీయంగా  నిర్వహిస్తున్నారు. మన క్రీడాకారులను నిజమైన ఛాంపియన్లుగా చూస్తున్నారు.

–పీటీ ఉష, ఇండియన్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షురాలు