ఇండియా అభివృద్ధి ప్రయాణంలో జపాన్ ది కీలకపాత్ర అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. భారత్, జపాన్ సహజ భాగస్వాములన్నారు. జపాన్, భారత్ మధ్య సాన్నిహిత్యం, ఆధ్యాత్మికత, సన్నిహిత సహకారం ఉందన్నారు. బుద్ధ భగవానుడి బాటలో నడవటం నేటి ప్రపంచానికి చాలా అవసరమని.. మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం అదొక్కటేనన్నారు. ప్రవాస భారతీయులు విదేశాల్లో ఉంటున్నా మాతృభూమిని మరువకపోవడం అతిపెద్ద బలమని చెప్పారు. జపాన్ టూర్ లో ఉన్న ప్రధాని మోడీ.. టోక్యోలో ప్రవాస భారతీయుల సమావేశంలో మాట్లాడారు.
మరిన్ని వార్తల కోసం
కేంద్రం హామీలను విస్మరించింది