రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఒక పక్షంవైపు నిలబడాల్సివస్తే అది శాంతి పక్షమేనని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. హింసకు వెంటనే ముగింపు పలికేందుకు తాము మద్దతు పలుకుతామన్నారు. ఉక్రెయిన్ సంక్షోభంపై లోక్సభలో చర్చ సందర్భంగా విదేశాంగశాఖ మంత్రి వివరణ ఇచ్చారు. దేశ నమ్మకాలు, విలువలు, జాతీయ ప్రయోజనం, వ్యూహం ప్రకారమే భారత వైఖరి ఉంటుందని స్పష్టం చేశారు. యుద్ధానికి భారత్ వ్యతిరేకమన్నారు. అమాయకుల ప్రాణాలు తీయటం, రక్తపాతంతో పరిష్కారం లభించదన్నారు. ఐక్యరాజ్యసమితితో పాటు.. అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికే భారత వైఖరి స్పష్టం చేశామని జైశంకర్ అన్నారు.
For More News..