
2023లో సోలార్ పవర్‍లో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశంగా భారత్ అవతరించింది. జపాన్ను వెనక్కి నెట్టి ఇండియా ఈ ఘనత సాధించింది. గత ఏడాది ప్రపంచంలో మొత్తం విద్యుత్తులో 5.5 శాతాన్ని సూర్యుడి వెలుగుతోనే సాధించినట్లు ఎంబెర్ మేధోమథన సంస్థ విడుదల చేసిన గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ నివేదికలో పేర్కొంది.
- భారతదేశం గత సంవత్సరం సౌరశక్తి నుంచి 5.8శాతం విద్యుత్తును ఉత్పత్తి చేసింది ఈ నివేదికలో పేర్కొంది.
- 2023లో సోలార్ పవర్ పెంచుకోవడంలో చైనా (+ 156 టెరావాట్ అవర్ (టీడబ్ల్యూహెచ్) మొదటి స్థానంలో ఉండగా, అమెరికా (+ 33 టీడబ్ల్యూహెచ్), బ్రెజిల్ (+22 టీడబ్ల్యూహెచ్), భారత్ (+18 టీడబ్ల్యూహెచ్) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
- చైనా సహా ప్రపంచంలో పలు దేశాల్లో జల విద్యుదుత్పత్తి ఐదేళ్ల కనిష్ఠ స్థాయికి తగ్గిపోయిందని, లేదంటే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ఇంకా పెరిగేదేనని వివరించింది.
- పవన, సౌర విద్యుత్తు రంగాల్లో పురోగతి వల్ల ప్రపంచవ్యాప్తంగా శుద్ధ ఇంధనం వాటా ఇప్పుడు 40 శాతానికి చేరినట్లు వెల్లడించింది.