2025లో ఇదే గుడ్ న్యూస్.. కొత్త ఏడాదిలో మస్తు ఉద్యోగాలు.. సాఫ్ట్వేర్ జాబ్స్ పరిస్థితి ఏంటంటే..

2025లో ఇదే గుడ్ న్యూస్.. కొత్త ఏడాదిలో మస్తు ఉద్యోగాలు.. సాఫ్ట్వేర్ జాబ్స్ పరిస్థితి ఏంటంటే..
  • ఐటీ, రిటైల్‌‌, టెలికమ్యూనికేషన్స్‌‌, ఫైనాన్షియల్ సెక్టార్లలో పెరగనున్న నియామకాలు: ఫౌండిట్ రిపోర్ట్‌

న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో మరిన్ని జాబ్స్ వస్తాయని హెచ్‌‌ఆర్‌ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌ఫౌండిట్‌‌‌ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ ఏడాదితో పోలిస్తే నియమాకాలు 9 శాతం పెరుగుతాయని అంచనా వేసింది. ముఖ్యంగా ఐటీ, రిటైల్‌‌‌‌‌‌‌‌, టెలికమ్యూనికేషన్స్‌‌‌, బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌, ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌, ఇన్సూరెన్స్ సెక్టార్లలో నియామకాలు ఎక్కువగా జరుగుతాయని తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం, కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది నియామకాలు 10 శాతం పెరిగాయి. అదే ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3 శాతం వృద్ధి చెందాయి. ఈ ట్రెండే కొత్త ఏడాదిలో కొనసాగుతుందని అంచనా.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ (ఏఐ), మెషీన్‌‌‌‌‌‌‌‌ లెర్నింగ్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీలకు గిరాకీ బాగుంది. ఎడ్జ్ కంప్యూటింగ్‌‌‌‌‌‌‌‌, సైబర్ సెక్యూరిటీస్ వంటి ఇన్నోవేటివ్ టెక్నాలజీలు  మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌, హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్, ఐటీ ఇండస్ట్రీల రూపురేఖలను మారుస్తాయి.  డిజిటల్‌‌‌‌‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌, యాడ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్ ఎనలిటిక్స్  సెగ్మెంట్లలో ప్రొఫెషనల్స్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ ఉంది. ‘ఈ ఏడాది మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌, రియల్ ఎస్టేట్ సెక్టార్లలో ఉద్యోగాలు ఎక్కువగా వచ్చాయి.  కోయంబత్తూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి టైర్ 2 సిటీలలో హైరింగ్ యాక్టివిటీ బాగుంది’ అని వివరించింది. 

ఈవీ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5 కోట్ల కొలువులు..
ఇంకో ఆరేళ్లలో  ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మార్కెట్ సైజ్ రూ.20 లక్షల కోట్లకు చేరుకోగలదని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ  మంత్రి నితిన్ గడ్కరీ అంచనా వేశారు. 5 కోట్ల ఉద్యోగాలు వస్తాయని అన్నారు. మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌కు ఫైనాన్స్ ఇచ్చే సెక్టార్ సైజ్‌‌‌‌‌‌‌‌  రూ.4 లక్షల కోట్ల మార్కును తాకుతుందని పేర్కొన్నారు. ఇండియా పొల్యూషన్‌‌‌‌‌‌‌‌లో 40 శాతం  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్​ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచే ఉందన్నారు. ‘ఏటా రూ.22 లక్షల కోట్ల విలువైన పెట్రోలియం ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను దిగుమతి చేసుకుంటున్నాం. ఇవి చాలా సమస్యలకు కారణమవుతున్నాయి. ప్రభుత్వం రెన్యూవబుల్ ఎనర్జీపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా సోలార్ ఎనర్జీని పెంచుకోవాలని చూస్తోంది’ అని  మంత్రి వివరించారు.