శనివారం(జూలై 13) హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో భారత జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 152 పరుగుల పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని భారత యంగ్ గన్స్ ఆడుతూ పాడుతూ చేధించారు. ఓపెనర్లు జోడి శుభ్‌మన్ గిల్ (13), యశస్వి జైస్వాల్ (42) ఇద్దరే మ్యాచ్ ముగించారు. 14.5 ఓవర్లలోనే ఛేదించి.. భారత యువ కెరటాల సత్తా ఏంటో చూపించారు. ఈ విజయంతో టీమిండియా.. పాకిస్థాన్ సరసన చేరింది.
ప్రత్యర్థి స్వదేశంలో భారత్‌కు ఇది 50వ విజయం. ఈ గెలుపుతో ప్రత్యర్థి జట్టు దేశంలో కనీసం 50 విజయాలు సాధించిన రెండో జట్టుగా టీమిండియా అవతరించింది. ఈ జాబితాలో 50 విజయాలతో పాకిస్తాన్.. భారత్‌కు సమంగా ఉంది.
ప్రత్యర్థి దేశంలో అత్యధిక విజయాలు సాధించిన జట్లు
- పాకిస్థాన్: 95 మ్యాచ్‌ల్లో 50 విజయాలు
- భారత్: 82 మ్యాచ్‌ల్లో 50 విజయాలు
- ఆస్ట్రేలియా: 79 మ్యాచ్‌ల్లో 39 విజయాలు
- న్యూజిలాండ్: 74 మ్యాచ్‌ల్లో 37 విజయాలు
- ఇంగ్లండ్: 76 మ్యాచ్‌ల్లో 35 విజయాలు