Oscars 2025: ఆస్కార్ రేసు నుండి లపతా లేడీస్ ఔట్.. మరో హిందీ మూవీకి దక్కిన అవకాశం.. 'సంతోష్‌’ కథ ఏంటి?

Oscars 2025: ఆస్కార్ రేసు నుండి లపతా లేడీస్ ఔట్.. మరో హిందీ మూవీకి దక్కిన అవకాశం.. 'సంతోష్‌’ కథ ఏంటి?

97వ ఆస్కార్ అవార్డుల (97TH OSCARS) పోటీలో ఇండియా నుంచి లాపతా లేడీస్ (Laapataa Ladies) మూవీ అర్హత సాధించింది తెలిసిందే. అయితే, అమీర్ ఖాన్ నిర్మాణంలో అతని భార్య కిరణ్ రావ్ డైరెక్ట్ చేసిన లాపతా లేడీస్ తాజాగా ఆస్కార్ రేసు నుండి తప్పుకుంది.

ఇవాళ బుధవారం (డిసెంబర్ 18న) ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఉత్తమ అంతర్జాతీయ చిత్రం (Best International Feature) కేటగిరీలో పోటీ పడే 15 సినిమాల జాబితా రిలీజ్ చేసింది. ఇందులో (10 కేటగిరీలు)కి సంబంధించిన షార్ట్‌లిస్ట్‌ను రిలీజ్ చేశారు.

ఆస్కార్స్ 2025కు లాపతా లేడీస్ ఇంటర్ నేషనల్ అవార్డు సాధిస్తుందనే ఆశలు ఉన్న.. చివర్లో షార్ట్ లిస్ట్కి నోచుకోలేదు. ఆస్కార్ ప్రమోషన్స్లో అమీర్ ఖాన్ అండ్ టీమ్ చాలా కష్టపడింది. అయినప్పటికీ దురదృష్టవశాత్తూ లాపతా లేడీస్ ఇండియా నుండి సెలెక్ట్ అవ్వకపోవడం సినీ ప్రియులకి నిరాశ కలిగిస్తోంది. అయితే, ఈ మూవీ స్థానంలో మరో హిందీ మూవీ చోటు దక్కించుకోవడం విశేషం. 

Also Read :- గాలి శీనులా గుర్తుండిపోయే బచ్చల మల్లి

లేటెస్ట్గా అంతర్జాతీయంగా పలు దేశాల నుండి ఆస్కార్ 2025 లో మొత్తం 85 సినిమాలను నామినేట్ చేశారు. వాటి నుంచి కేవలం 15 సినిమాలను మాత్రమే షార్ట్ లిస్ట్ చేశారు అకాడమీ నిర్వాహకులు. ఇందులో లాపతా లేడీస్కి దక్కని చోటు మరో హిందీ ఫిల్మ్ ' సంతోష్'(Santhosh)కి దక్కింది. ఈ మూవీ వివరాలు చూస్తే.. 

2024 మే 20న రిలీజైన 'సంతోష్' (Santosh) మూవీ ఆస్కార్ 2025కి ఎంపికైంది. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన 'సంతోష్' మూవీని ఆస్కార్ లిస్ట్ ప్రకటించి మూడు రోజులయ్యాక.. అనూహ్యంగా అనౌన్స్ చేశారు. సంధ్యా సూరి తెరకెక్కించిన 'సంతోష్' మూవీ 'UK ఆస్కార్స్ 2025' కోసం ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్‌గా ఎంపికైంది.

ఈ చిత్రంలో భారతీయ నటీనటులు షహానా గోస్వామి మరియు సునీతా రాజ్‌వర్ ప్రధాన పాత్రల్లో నటించారు. షహానా గోస్వామి ఇందులో సంతోష్‌గా నటించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ఈ మూవీని ప్రదర్శించారు. దాంతో ఈ సినిమా విదేశ చిత్రాలకు పోటీగా నిలిచింది.

ఎంపిక ఎలా జరిగింది?

ఈ ఏడాది 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం అన్‌ సెర్టైన్‌ రికార్డ్‌లో ప్రదర్శించబడింది. అక్కడ భారీ స్థాయిలో విడుదల కావడం, దానికి బ్రిటీష్ నిర్మాతల మద్దతు ఉండడంతో సంతోష్ మూవీ యూకే నుంచి ఎంపికవ్వడం జరిగింది. ఈ చిత్రాన్ని మైక్ గుడ్‌రిడ్జ్, జేమ్స్ బాషర్, బాల్తాజర్ డి గనే మరియు అలాన్ మెక్‌అలెక్స్ నిర్మించారు. అమా అంపడు, ఎవా యేట్స్, డైర్మిడ్ స్క్రిమ్‌షా, లూసియా హాస్లౌర్ మరియు మార్టిన్ గెర్హార్డ్ దీని ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. UK ప్రెజెంటేషన్‌ను ఎంపిక చేసేందుకు అమెరికన్ అకాడమీ నియమించిన బాఫ్టా అనే సంస్థ ఈ చిత్రాన్ని ఎంపిక చేసిందని డెడిన్ తెలిపారు. 

'సంతోష్‌' కథ ఏంటి?  

సంధ్య సూరి రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా కథ ఉత్తర భారతదేశంలోని ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. కొత్తగా పెళ్లయిన ఓ మహిళ సంతోష్‌ (షహానా గోస్వామి) ..కొంతకాలం తర్వాత ఆమె భర్త చనిపోవడంతో..ఒక  ప్రభుత్వ పథకం ద్వారా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం పొందుతుంది.

ఈ క్రమంలో నిమ్న కులాల దళిత సమాజానికి చెందిన ఒక టీనేజ్ అమ్మాయికి సంబంధించిన క్రూరమైన హత్యను ఛేదించే కేసులోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ కఠినమైన కేసును ఇన్వెస్టిగేటివ్ చేస్తున్న అనుభవజ్ఞుడైన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ శర్మ (సునీతా రాజ్‌వార్)తో కలిసి ఆ మైనర్ బాలిక కేసును విచారించడం ప్రారంభిస్తుంది. 

అయితే, ఈ  ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తన దృష్టికి ఎన్నో విషయాలు వస్తాయి. వివక్షతతో కూడిన సమాజంలో.. పనిచేసే మహిళలు ఎలా అణిచివేయబడుతున్నారు? ఇటువంటి విషయాలను వెలుగులోకి తీసుకురావడానికి సంతోష్‌, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ శర్మ ఏం చేశారనేది కథ.