దేశ తొలి మల్టీ పర్పస్​ వెసెల్​ సమర్థక్​.. ప్రయోజనాలు

దేశ తొలి మల్టీ పర్పస్​ వెసెల్​ సమర్థక్​.. ప్రయోజనాలు

భారత నావికాదళం కోసం ఎల్​అండ్​ టీ షిప్​యార్డ్​ నిర్మించిన దేశ తొలి మల్టీ పర్పస్​ వెసెల్​(ఎంపీవీ) షిప్​ను కట్టుపల్లిలో లాంఛనంగా ప్రారంభించారు. హిందీలో సమర్థక్​ అంటే సపోర్టర్​ అని అర్థం. 

ఎంపీవీ ప్రాజెక్ట్​

రెండు మల్టీ పర్పస్​ వెసెల్స్​ను నిర్మించేందుకు 2022, మార్చి 5న ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇందుకోసం భారత రక్షణ మంత్రిత్వశాఖ, ఎల్​అండ్​టీ షిప్​యార్డ్​ మధ్య ఒప్పందం కుదిరింది. అత్యాధునిక నౌకాదళ నౌకలతో సమానంగా ఇవి తమ విధులను నిర్వర్తిస్తాయి. 

బహుళ ప్రయోజన నౌకలు

ప్రత్యేకించి అత్యవసర పరిస్థితుల్లో ఇతర నౌకలను తరలించడంలో సహాయపడతాయి. ఈ నౌకలు నౌకాదళ శిక్షణ సమయంలో ఉపయోగించే వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఇవి సిబ్బంది అవసరం లేని స్వయంప్రతిపత్తి వాహనాలను మోహరించి నియంత్రించగలవు. దేశంలో అభివృద్ధి చేసిన కొత్త ఆయుధాలు, సెన్సర్లను పరీక్షించడానికి ఎంపీవీలు ఉపయోగపడుతాయి. ఇవి కంటైనర్లు, పెద్ద యంత్రాలు లేదా భారీ లోడ్లు తదితర అనేక రకాల సరుకులను మోయగలవు. చమురు, గ్యాస్ అన్వేషణలో సహాయం చేయడం, వాణిజ్య ఆఫ్​షోర్​ కార్యకలాపాలకు ఇవి 
ఉపయోగపడతాయి.