IND vs BAN 2024: పంత్, గిల్ మెరుపులు.. చెన్నై టెస్టులో పట్టు బిగించిన భారత్

IND vs BAN 2024: పంత్, గిల్ మెరుపులు.. చెన్నై టెస్టులో పట్టు బిగించిన భారత్

చెన్నై టెస్టులో భారత్ విజయం ఖాయంగా కనిపిస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించిన భారత్.. రెండో ఇన్నింగ్స్ లోనూ అదే జోరు చూపిస్తుంది. మూడో రోజు తొలి సెషన్ లో శుభమాన్ గిల్, రిషబ్ పంత్ చెలరేగడంతో భారత్ లంచ్ సమయానికి 432 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. క్రీజ్ లో గిల్ (86), పంత్ (82) ఉన్నారు. భారత్ చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. గిల్, పంత్ సెంచరీల తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశముంది. 

3 వికెట్ల నష్టానికి 81 పరుగులతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్.. ఒక్క వికెట్ పడకుండా సెషన్ ముగించింది. ఈ సెషన్ లో మొత్తం 124 పరుగులు భారత్ రాబట్టింది. గిల్, పంత్ ఆరంభంలో క్రీజ్ లో కుదురుకోవడానికి సమయం తీసుకున్నా క్రమంగా జోరు పెంచారు. మొదట గిల్.. ఆ తర్వాత పంత్ బౌండరీల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నారు. బంగ్లా బౌలర్లు ఎంత ప్రయత్నించినా వికెట్ రాబట్టలేకపోయారు.

Also Read :- బంగ్లాను చుట్టేసిన రోహిత్.. ఒకే ఫ్రేమ్‌లో 11 మంది ఫీల్డర్లు

పంత్, గిల్ నాలుగో వికెట్ కు అజేయంగా 132 పరుగులు జోడించడం విశేషం. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 149 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.