IND vs BAN 2024: రోహిత్, కోహ్లీ విఫలం.. భారీ ఆధిక్యంతో పట్టు బిగించిన భారత్

IND vs BAN 2024: రోహిత్, కోహ్లీ విఫలం.. భారీ ఆధిక్యంతో పట్టు బిగించిన భారత్

చెన్నై టెస్టులో రెండో రోజు కూడా భారత్ ఆధిపత్యం చూపించింది. తొలి రోజు తొలి రెండు సెషన్ లు విఫలమైనా.. అశ్విన్ సెంచరీ.. జడేజా హాఫ్ సెంచరీతో భారత్ భారీ 376 పరుగుల భారీ స్కోర్ చేసింది. రెండో రోజు అదే జోరు చూపిస్తూ మన బౌలర్లు విజ్రంభించడంతో  చెన్నై టెస్టులో భారత్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో భారత్ 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. దీంతో భారత్ ఆధిక్యం 306 పరుగులకు చేరింది. క్రీజ్ లో గిల్ (33), పంత్ (12) ఉన్నారు.

227 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన భారత్ కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ 5 పరుగులు మాత్రమే చేసి స్లిప్ లో దొరికిపోయాడు. కాసేపటికే జైశ్వాల్ డ్రైవ్ కోసం ప్రయత్నించి వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 2 ఫోర్లు కొట్టి టచ్ లోకి వచ్చిన కోహ్లీ 17 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, నహిద్ రానా, మెహదీ హసన్ మిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. మూడు వికెట్లు కోల్పోయిన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో భారత్ తొలి టెస్టులో  గెలుపు దిశగా దూసుకెళ్తుంది.

ALSO READ | IND vs BAN 2024: స్వల్ప స్కోర్‌కే బంగ్లా.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు భారీ ఆధిక్యం

భారత్ తమ తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ సెంచరీ (113) తో చెలరేగగా..  జడేజా (86), జైశ్వాల్ (56) హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ లు ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమ్మద్ కు ఐదు వికెట్లు దక్కాయి.  బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 149 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.