IND vs ENG 3rd Test: జైస్వాల్, గిల్ భారీ భాగస్వామ్యం..భారత్ ఆధిక్యం ఎంతంటే..?

IND vs ENG 3rd Test: జైస్వాల్, గిల్ భారీ భాగస్వామ్యం..భారత్ ఆధిక్యం ఎంతంటే..?

రాజ్ కోట్ టెస్టులో భారత్ పట్టు బిగిస్తుంది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికారేశారు. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ భారీ భాగస్వామ్యంతో మ్యాచ్ ను భారత్ వైపుకు తిప్పేశారు. వీరిద్దరి ఆటతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. క్రీజ్ లో గిల్ (65), నైట్ వాచ్ మెన్ కుల్దీప్ యాదవ్(3) ఉన్నారు. ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్ లో 322 పరుగుల ఆధిక్యంలో ఉంది. సెంచరీ హీరో(104) జైస్వాల్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. 
   
మూడో రోజు ఆటలో ఏదైనా హైలెట్ ఉందంటే అది జైస్వాల్, గిల్ భాగస్వామ్యమే. మొదట్లో డిఫెన్స్ కే ప్రాధాన్యం ఇచ్చిన ఈ జోడీ ఆ తర్వాత క్రమంగా బ్యాట్ ఝళిపించారు. ముఖ్యంగా ఓపెనర్ జైశ్వాల్ ఇంగ్లాండ్ బౌలర్లపై దారుణంగా విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో తన టెస్ట్ కెరీర్ లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్ సెంచరీ తర్వాత గిల్ దూకుడు పెంచి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇద్దరూ మూడో వికెట్ కు 155 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సెంచరీ తర్వాత జైస్వాల్ కు కాళ్ళు పట్టేయడంతో రిటైర్డ్ ఔట్ గా వెనుదిరిగాడు. 

వికెట్ నష్టానికి 44 పరుగులతో చివరి సెషన్ ను ప్రారంభించగా..ఈ సెషన్ లో 35 ఓవర్లో ఏకంగా 152 పరుగులు రాబట్టింది. ఇంగ్లాండ్ బౌలర్లలో హర్టీలి,రూట్ చెరో వికెట్ తీసుకున్నారు. అంతకముందు ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 319 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ వ్యక్తిగత కారణాల వలన దూరమైనా.. భారత బౌలర్లు ఆ లోటును తెలియనివ్వలేదు. సమిష్టిగా బౌలింగ్ చేస్తూ ఇంగ్లాండ్ ను తక్కువ పరుగులకే కట్టడి చేశారు. సిరాజ్ 4 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్, జడేజా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. అశ్విన్, బుమ్రా తలో వికెట్ తీసుకున్నారు. ఇంగ్లాండ్ తమ చివరి 8 వికెట్లను 95 పరుగులకే కోల్పోయింది.