ఆస్ట్రేలియాతో 5 టీ20 ల సిరీస్ లో భాగంగా టీమిండియా అదరగొట్టేస్తుంది. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ కంగారూల జట్టును చిత్తు చేసి 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లారు. వైజాగ్ లో జరిగిన తొలి టీ 20లో చివరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ కొట్టిన సూర్య సేన.. నిన్న(నవంబర్ 26) త్రివేండ్రంలో జరిగిన రెండో టీ20 లో 44 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో టీ20 చరిత్రలో ఒక సరికొత్త రికార్డ్ అందుకొని పాకిస్థాన్ ను సమం చేసింది.
టీ20 చరిత్రలో భారత్ ఇప్పటివరకు 211 టీ20 మ్యాచ్‌లు ఆడగా 135 విజయాలు, 66 ఓటములు చవిచూసింది. ఈ విజయంతో టీ20 చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా పాకిస్థాన్ ప్రపంచ రికార్డును సమం చేసింది. మరోవైపు పాకిస్థాన్ 226 మ్యాచ్‌లు ఆడగా, 135 గెలిచి 82 ఓడిపోయింది. అయితే విజయాల శాతం చూసుకుంటే పాక్ కన్నా భారత్ ముందంజలో ఉంది. భారత్ గెలుపు శాతం 63.98గా ఉంటే పాక్ గెలుపు శాతం 59.73 గా ఉంది. దీంతో విజయాలు సమానంగా ఉన్నా విజయాల శాతం పరంగా భారత్ టాప్ లో నిలిచింది.
ఇక నిన్న (నవంబర్ 26) జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. టాపార్డర్ జైస్వాల్(53), గైక్వాడ్(58), కిషన్(52) మెరుపు ఇన్నింగ్స్ లు ఆడి హాఫ్ సెంచరీలు చేయగా.. చివర్లో రింకూ సింగ్ 9 బంతుల్లోనే 31 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్ 20 ఓవర్లలో 9 వికెట్లను 191 పరుగు;లు మాత్రమే చేయగలిగింది. 45 పరుగులతో స్టోయినీస్ ఆసీస్ జట్టు టాప్ స్కోరర్ గా నిలిచాడు.
India have equalled Pakistan's world record in T20Is | DETAILS#INDvsAUS #indvsaust20 #indvsaust20i #indvsaus2023 https://t.co/A0MeS4mpUY
— IndiaTVSports (@IndiaTVSports) November 27, 2023