
టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు సెమీస్ కు అర్హత సాధించాయి. గ్రూప్ 2 లో భాగంగా సౌతాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే.. ఇంగ్లాండ్ రెండు మ్యాచ్ ల్లో గెలిచి సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. వెస్టిండీస్, అమెరికా జట్లు టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించాయి. ఇక గ్రూప్ ఏ విషయానికి వస్తే నాలుగు జట్లు సెమీస్ రేస్ లోనే ఉన్నాయి. ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలిచిన భారత్.. దాదాపు సెమీస్ సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్ లో గెలిచినా.. తక్కువ పరుగులతో ఓడిపోయినా.. మ్యాచ్ రద్దయినా గ్రూప్ ఏ లో భారత్ టాప్ లో నిలుస్తుంది.
ఇంగ్లాండ్ తో భారత్ ఢీ
గ్రూప్ బి లో భాగంగా ఇంగ్లాండ్ మూడు మ్యాచ్ ల్లో గెలిచిన దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది. రెండు విజయాలతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో ఉంది. గ్రూప్ ఏ లో భారత్ టాప్ లో ఉండడం దాదాపుగా ఖాయమైంది. అదే జరిగితే భారత్, ఇంగ్లాండ్ 2024 టీ20 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ ఆడతాయి. ఆస్ట్రేలియా/ బంగ్లాదేశ్ /ఆఫ్ఘనిస్తాన్ లలో ఒక జట్టు సౌతాఫ్రికాతో తలపడుతుంది. గ్రూప్-1లోని అగ్రశ్రేణి జట్టు గ్రూప్-2లో రెండో ర్యాంక్‌తో తలపడాలని, గ్రూప్-2లోని అగ్రశ్రేణి జట్టు గ్రూప్-1లో తలపడాలని ఇప్పటికే నిర్ణయించారు.
2022 టీ20 వరల్డ్ కప్ లోనూ భారత్, ఇంగ్లాండ్ తలపడడం విశేషం. దీంతో మరోసారి అదే సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో భారత్ ను చిత్తు చేసింది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సువర్ణావకాశం భారత్‌కు దక్కింది. మరోసారి ఈ రెండు జట్లు తలపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే జూన్ 27న భారత్, ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ చూడొచ్చు. జూన్ 28 న మరో సెమీ ఫైనల్.. జూన్ 29 న బార్బడోస్ లో ఫైనల్ జరుగుతుంది.
THE LIKELY SEMI-FINAL FIXTURE IN THE T20I WORLD CUP 2024:
— Johns. (@CricCrazyJohns) June 24, 2024
- India vs England
- South Africa vs Afghanistan/Australia. pic.twitter.com/yAtM1Fj5M9