ఆసియా కప్ 2023: ఆ ముగ్గురికి రెస్ట్.. తుది జట్టులో తిలక్ వర్మ..? 

ఆసియా కప్ 2023: ఆ ముగ్గురికి రెస్ట్.. తుది జట్టులో తిలక్ వర్మ..? 

ఆసియా కప్ సూపర్-4లో భాగంగా టీమిండియా నేడు బంగ్లాదేశ్ మీద చివరి మ్యాచ్ ఆడబోతుంది. ఇప్పటికే రోహిత్ సేన ఫైనల్ చేరిన  నేపథ్యంలో ఈ రోజు ఆడే ప్లేయింగ్ 11 ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ నామమాత్రం కావడంతో బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లు తుది జట్టుకలో చోటు కోసం ఎంతో ఆతృత్తగా ఎదరు చూస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలో రెండు మ్యాచులు ఆడిన మన ఆటగాళ్లు ఈ రోజు రెస్ట్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఎవరు రెస్ట్ తీసుకుంటారు ఎవరు తుది జట్టులో స్థానం దక్కించుకుంటారో ఇప్పుడు చూద్దాం
 
ఆ ఇద్దరికి చోటు గ్యారంటీ 

ఆసియా కప్ లో బంగ్లా పోరుకి టీమిండియా సిద్ధమవుతుంది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచులో రిపోర్ట్స్ ప్రకారం స్టార్ పేసర్లు బుమ్రా, సిరాజ్ తో పాటు ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యకి రెస్ట్ ఇవ్వనున్నారు. వీరి ప్లేస్ లో శార్దూలు ఠాకూర్, ప్రసిద్ కృష్ణ, మహమ్మద్ షమీ రానున్నారు. ఇక బ్యాటింగ్ లో శ్రేయాస్ అయ్యర్ రావడంతో ఎవరి స్థానంలో ఆడతాడని సందేహం అందరిలో ఉంది. వరల్డ్ కప్ ముందు అయ్యర్ తన ఫిట్ నెస్, ఫామ్ నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయం. దీంతో ఈ బ్యాటర్ ప్లేయింగ్ 11 ఉంటాడు అనడంలో ఎలాంటి అనుమానం లేదు.
 
తిలక్ వర్మ అవకాశాలు ఎంత..?

ప్రస్తుతం టీమిండియా స్క్వాడ్ లో సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మకు ఒక్క అవకాశం కూడా రాలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరికి అవకాశం ఇవ్వాలంటే టాపార్డర్ రోహిత్,గిల్, కోహ్లీ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వరల్డ్ కప్ స్క్వాడ్ లో లేని తిలక్ ఈ మ్యాచులో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ప్లేయింగ్ 11 లో చోటు దక్కదు. మరి టీమిండియా బలహీన బంగ్లాదేశ్ పై ఎలాంటి మార్పులతో బరిలోకి దిగుతుందో చూడాలి.