భారత్‌‌పై మళ్లీ కరోనా పంజా

భారత్‌‌పై మళ్లీ కరోనా పంజా

భారతదేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తుందా ? అంటే అవుననే అనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా తక్కువగా నమోదైన కేసులు.. ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. కొత్త వేరియంట్ల మధ్య భారత్‌‌లో కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో నాలుగు వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 84 రోజుల తర్వాత 4 వేల కేసులు నమోదయ్యాయి. 4 వేల 041 కరోనా వైరస్ కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం కోవిడ్ (Covid -19) కేసుల సంఖ్య 4,31,68,585కి చేరుకుంది. అయితే. క్రియాశీల కేసులు 21 వేల 177కి పెరిగాయి. పది మంది చనిపోయారని పేర్కొంది. దీంతో మరణాల సంఖ్య 5,24,651కి చేరుకున్నాయి.

జాతీయ కోవిడ్ రివకరీ రేటు 98.74 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజు వారీ పాజిటివిటీ రేటు 0.60 శాతంగా నమోదైంది. దేశంలోని కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య ఎక్కువగా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. తర్వాతి స్థానంలో కేరళ, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, ఒడిశా రాష్ట్రాలున్నాయి. మరోవైపు.. వ్యాక్సిన్ ప్రక్రియ కూడా జోరుగా కొనసాగుతోంది. 193.8 కోట్ల కోవిడ్ 19 వ్యాక్సిన్లను పంపిణీ చేశారు. మొదటి డోసుల సంఖ్య 91.6 కోట్లు ఉండగా.. రెండో డోస్ తీసుకున్న వారి సంఖ్య 82.9 కోట్లుగా ఉందని తెలిపింది. కరోనా వైరస్ కేసుల పెరుగుదల ఇతర దేశాల్లో కూడా ఉందనే సంగతి తెలిసిందే. దీనిపై WHO పలు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ వైరస్ తో పాటు కొత్త వేరియంట్లు వ్యాపిస్తున్నాయని, దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. 

మరిన్ని వార్తల కోసం : -
ప్రియుడిని పెళ్లి చేసుకొనేందుకు బంగ్లాదేశ్ యువతి సాహసం


ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్