కుర్రాళ్లు ఢమాల్‌‌‌‌‌‌‌‌..అండర్‌‌‌‌‌‌‌‌–19 ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా ఓటమి

కుర్రాళ్లు ఢమాల్‌‌‌‌‌‌‌‌..అండర్‌‌‌‌‌‌‌‌–19 ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా ఓటమి
  • 43 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ గెలుపు
  • షాజెబ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ భారీ సెంచరీ

దుబాయ్‌‌‌‌‌‌‌‌ : అండర్‌‌‌‌‌‌‌‌–19 ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌ బోణీ కొట్టలేకపోయారు. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ వైఫల్యంతో భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను ఛేజ్‌‌‌‌‌‌‌‌ చేయలేకపోయారు. దీంతో శనివారం జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎ తొలి లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా 43 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడింది. టాస్‌‌‌‌‌‌‌‌ గెలిచి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన పాక్‌‌‌‌‌‌‌‌ 50 ఓవర్లలో 281/7 స్కోరు చేసింది. షాజెబ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ (147 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 10 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 159) భారీ సెంచరీతో చెలరేగగా, ఉస్మాన్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ (60) అండగా నిలిచాడు. 

రియాజుల్లా (27) ఫర్వాలేదనిపించాడు. తర్వాత ఇండియా 47.1 ఓవర్లలో 238 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. నిఖిల్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ (67) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. మహ్మద్‌‌‌‌‌‌‌‌ ఇనామ్‌‌‌‌‌‌‌‌ (30) ఫర్వాలేదనిపించాడు.  షాజెబ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. సోమవారం జరిగే రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా.. జపాన్‌‌‌‌‌‌‌‌తో తలపడుతుంది. 

భారీ భాగస్వామ్యం..

ముందుగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన పాక్‌‌‌‌‌‌‌‌ను కట్టడి చేయడంలో ఇండియా బౌలర్లు విఫలమయ్యారు. సమర్థ్‌‌‌‌‌‌‌‌ నాగరాజ్‌‌‌‌‌‌‌‌ (3/45), ఆయూష్‌‌‌‌‌‌‌‌ మాత్రే (2/30) కాసేపు ప్రభావం చూపినా.. ఓపెనర్లు ఉస్మాన్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌, షాజెబ్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ జోరు ముందు తేలిపోయారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 160 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి మంచి పునాది వేశారు. ఈ దశలో మాత్రే.. తన వరుస ఓవర్లలో ఉస్మాన్‌‌‌‌‌‌‌‌తో పాటు హరూన్‌‌‌‌‌‌‌‌ అర్షద్‌‌‌‌‌‌‌‌ (3)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో పాక్‌‌‌‌‌‌‌‌ 170/2తో నిలిచింది. కానీ రియాజుల్లా అండతో షాజెబ్‌‌‌‌‌‌‌‌ మళ్లీ బ్యాట్‌‌‌‌‌‌‌‌ ఝుళిపించాడు. ఇండియా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను దీటుగా ఎదుర్కొంటూ మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 71 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేశాడు. 

ఇక షాజెబ్‌‌‌‌‌‌‌‌ను క్రీజులో నిలబెట్టి రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి స్కోరును అడ్డుకున్నారు. ఫర్హాన్‌‌‌‌‌‌‌‌ యూసుఫ్‌‌‌‌‌‌‌‌ (0), ఫహమ్‌‌‌‌‌‌‌‌ ఉల్‌‌‌‌‌‌‌‌ హక్‌‌‌‌‌‌‌‌ (4), సాద్‌‌‌‌‌‌‌‌ బేగ్‌‌‌‌‌‌‌‌ (4) సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌కే ఔట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో పాక్‌‌‌‌‌‌‌‌ స్కోరు 274/7గా మారింది. అప్పటికే సెంచరీ పూర్తి చేసిన షాజెబ్‌‌‌‌‌‌‌‌ లాంగాన్‌‌‌‌‌‌‌‌, లాంగాఫ్‌‌‌‌‌‌‌‌లో భారీ సిక్సర్లతో రెచ్చిపోవడంతో మంచి టార్గెట్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. యుధజిత్‌‌‌‌‌‌‌‌, కిరణ్‌‌‌‌‌‌‌‌ కొర్మాలె చెరో వికెట్‌‌‌‌‌‌‌‌ తీశారు. 

పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు క్యూ..

ఛేదనలో ఇండియాకు ఏదీ కలిసి రాలేదు. పాక్‌‌‌‌‌‌‌‌ బౌలర్లు సమయోచితంగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ వరుస విరామాల్లో వికెట్లు తీసి అడ్డుకున్నారు. ఓపెనర్లు ఆయూష్‌‌‌‌‌‌‌‌ మాత్రే (20) వేగంగా ఆడినా నాలుగో ఓవర్‌‌‌‌‌‌‌‌లోనే వెనుదిరిగాడు. వైభవ్‌‌‌‌‌‌‌‌ సూర్యవంశీ (1), ఆండ్రీ సిద్ధార్థ్‌‌‌‌‌‌‌‌ (15), కెప్టెన్‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌ అమన్‌‌‌‌‌‌‌‌ (16) తేలిపోయారు. దీంతో 81/4తో ఇండియా కష్టాల్లో పడింది. ఈ దశలో నిఖిల్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ ఒంటరి పోరాటం చేశాడు. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో సరైన సహకారం లేకపోయినా తాను ఉన్నంతసేపు స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. 

మిడిల్‌‌‌‌‌‌‌‌లో కిరణ్‌‌‌‌‌‌‌‌ కొర్మాలె (20), హర్వాన్ష్‌‌‌‌‌‌‌‌ (26) కాసేపు అండగా నిలిచారు. చివర్లో హార్దిక్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌ (10), సమర్థ్‌‌‌‌‌‌‌‌ నాగరాజ్‌‌‌‌‌‌‌‌ (0) విఫలం కావడంతో చేయాల్సిన రన్‌‌‌‌‌‌‌‌రేట్‌‌‌‌‌‌‌‌ పెరిగిపోయింది. ఆఖర్లో మహ్మద్‌‌‌‌‌‌‌‌ ఇనామ్‌‌‌‌‌‌‌‌ బ్యాట్‌‌‌‌‌‌‌‌ ఝుళిపించి పదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 38 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేసి వెనుదిరిగాడు. అలీ రజా 3, అబ్దుల్‌‌‌‌‌‌‌‌ సుభాన్‌‌‌‌‌‌‌‌, ఫహమ్‌‌‌‌‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. 

సంక్షిప్త స్కోర్లు

పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ : 50 ఓవర్లలో 281/7 (షాజెబ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ 159, ఉస్మాన్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ 60, సమర్థ్‌‌‌‌‌‌‌‌ 3/45). 

ఇండియా : 47.1 ఓవర్లలో 238 ఆలౌట్‌‌‌‌‌‌‌‌ (నిఖిల్‌‌‌‌‌‌‌‌ 67, ఇనామ్‌‌‌‌‌‌‌‌ 30, అలీ రెజా 3/36).