IND Vs NZ, 1st Test: నిప్పులు చెరుగుతున్న కివీస్ పేసర్లు.. 10 పరుగులకే భారత్ 3 వికెట్లు

బెంగుళూరు టెస్టులో టీమిండియాకు మంచి ఆరంభం దక్కలేదు. న్యూజిలాండ్ పేసర్లు చెలరేగడంతో  కేవలం 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్ లో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగిన కివీస్ న్యాయం చేసింది. విలియం ఒరోర్కే, సౌథీ, హెన్రీ తలో వికెట్ తీసి టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం టీమిండియా 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 13 పరుగులే చేసింది. క్రీజ్ లో ఓపెనర్ జైశ్వాల్(8) పంత్ (3) ఉన్నారు.

Also Read:-ముంబైతోనే రోహిత్.. రిటైన్ చేసుకునే నలుగురు వీరే!

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ ప్రారంభంలో ఆచితూచి ఆడింది. మరోవైపు కివీస్ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో భారత్ ను భయపెట్టారు. దీంతో తొలి ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 9 పరుగులు మాత్రమే చేసింది. అయితే 7 ఓవర్ నుంచి భారత్ పతనం స్టార్ అయింది. సౌథీ అద్భుతమైన బంతితో రోహిత్ (2) ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లో ఒరోర్కే కోహ్లీని డకౌట్ చేయగా.. సర్ఫరాజ్ కూడా హెన్రీ బౌలింగ్ లో డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో 9/0 గా ఉన్న భారత్ ఒక్కసారిగా 10/3 తో కష్టాల్లో పడింది.