
ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో న్యూజిలాండ్ పోరాడుతోంది. దుబాయ్ వేదికగా భారత్ తో జరుగుతున్న ఫైనల్లో స్వల్ప వ్యవధిలో మూడు కీలక వికెట్లు తీసి భారత్ ను టెన్షన్ పెడుతుంది. కివీస్ స్పిన్నర్లు విజృంభించడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. ఒకదశలో వికెట్ నష్టపోకుండా 105 పరుగులతో పటిష్టంగా కనిపించిన భారత్.. ఆ తర్వాత 17 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. సాంట్నర్ వేసిన బంతిని కవర్స్ మీదుగా ఆడిన గిల్(31).. ఫిలిప్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సూపర్ మ్యాన్ తరహాలో ఫిలిప్స్ ఈ క్యాచ్ అందుకోవడం విశేషం.
ALSO READ | IND vs NZ Final: విలియంసన్ స్థానంలో చాప్ మన్.. ఫీల్డింగ్‌కు రాని కేన్ మామ
క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ ఒక పరుగు మాత్రమే చేసి బ్రేస్ వెల్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. హాఫ్ సెంచరీతో క్రీజ్ లో కుదురుకున్న రోహిత్ (76).. భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 20 ఓవర్ తొలి బంతికి రచీన్ రవీంద్ర బౌలింగ్ లో స్టంపౌటయ్యాడు. దీంతో 105/0 తో ఉన్న ఇండియా 122/3 తో నిలిచింది. ప్రస్తుతం భారత 32 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్(24), అక్షర్ పటేల్(8) క్రీజ్ లో ఉన్నారు. భారత్ గెలవాలంటే మరో 105 పరుగులు చేయాలి. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రేస్ వెల్, రచీన్ రవీంద్ర, సాంట్నర్ లకు తలో వికెట్ లభించింది.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ డారిల్ మిచెల్, బ్రేస్ వెల్ అద్భుతంగా రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 251 పరుగుల మోస్తరు స్కోర్ చేసింది. డారిల్ మిచెల్ 101 బంతుల్లో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. బ్రేస్ వెల్ 51 పరుగులు చేసి చివర్లో మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. జడేజా, షమీలకు ఒక వికెట్ దక్కింది.