కల చెదిరె.. కప్పు చేజారె.. వరల్డ్ కప్‌‌ ఫైనల్లో ఓడిన ఇండియా

కల చెదిరె.. కప్పు చేజారె..  వరల్డ్ కప్‌‌ ఫైనల్లో ఓడిన ఇండియా
  • యావత్‌‌‌‌‌‌‌‌ దేశం చేసిన పూజలు ఫలించలేదు..! 
  • ముచ్చటగా మూడోసారి కప్‌‌‌‌‌‌‌‌ గెలవాలన్న భారతీయుడి కలా నెరవేరలేదు..! 
  • అద్భుతం జరగలేదు.. చరిత్రా మారలేదు..! 
  • కాలం ఇచ్చిన ఓ గొప్ప అవకాశం మరోసారి చేజారింది..!
  • లక్షకు పైగా గొంతుకలు.. కోట్లాది హృదయాలు.. 

టీమిండియా కల చెదిరింది. చేతుల్లోకి వచ్చిన వరల్డ్ కప్ చేజారింది. స్వదేశంలో వన్డే వరల్డ్ కప్‌‌లో వరుసగా పది విజయాలతో.. ఎదురైన ప్రతీ జట్టునూ మట్టి కరిపిస్తూ దూసుకొచ్చిన రోహిత్​సేన ఆఖరి మెట్టుపై తడబడింది.  అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం లక్ష మంది ప్రేక్షకుల ముంగిట జరిగిన ఫైనల్ మ్యాచ్‌‌లో ఇండియా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపెట్టిన ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్ కప్‌‌ నెగ్గి ఈ ఆటలో  తమకు తిరుగేలేదని మరోసారి చాటి చెప్పింది. 

ఏకపక్షంగా సాగిన తుది పోరులో ఇండియా 50 ఓవర్లలో 240 రన్స్‌‌కే ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (66), విరాట్ కోహ్లీ (54), రోహిత్ శర్మ (47) రాణించినా మిగతా బ్యాటర్లు నిరాశ పరచడంతో ఆతిథ్య జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. చేజింగ్‌‌లో ట్రావిస్ హెడ్‌‌ (137) సెంచరీతో చెలరేగడంతో ఆస్ట్రేలియా 43 ఓవర్లలో నాలుగే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. హెడ్‌‌ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌గా నిలవగా.. విరాట్‌‌ కోహ్లీకి ప్లేయర్‌‌‌‌ ఆఫ్​ ద టోర్నమెంట్ అవార్డు దక్కింది.

జయహో ఇండియా అంటూ చేసిన జయజయ ద్వానాల మధ్య ‘వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్స్‌‌‌‌‌‌‌‌’ అనే సువర్ణాక్షరాలు కళ్ల ముందే కరిగిపోయాయి..! పోరాటానికి ప్రతీకగా నిలిచే ఆస్ట్రేలియన్లు చూపెట్టిన తెగువ, తెగింపు, స్ఫూర్తిదాయకమైన ఆఖరాటలో టీమిండియా ఓడిపోయింది..! ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఫోబియాను అధిగమించలేక.. పుష్కర కాలం తర్వాత వచ్చిన మహాద్భుత అవకాశాన్ని అలా అలా జారవిడిచింది..! ఎవరిమీద అయితే గెలిచి వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ పోరాటాన్ని మొదలుపెట్టిన మనోళ్లు.. వాళ్లకే కప్‌‌‌‌‌‌‌‌ అప్పగించి వెనుదిరిగారు..!  ఎలా మొదలుపెట్టామన్నది కాదు.. ఎక్కడ ఎలా ముగించాలో తెలిసిన కంగారూలు ఆరోసారి జగజ్జేతలుగా నిలిచి ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు..!

అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌:  వరుసగా గెలిచిన అనుభవం ఏమాత్రం అక్కరకు రాలేదు. వందలకొద్ది రన్స్‌‌‌‌‌‌‌‌ చేసిన స్టార్లెవరూ ఆదుకోలేదు. గత 10 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో జైత్రయాత్ర చేసిన బౌలర్లెవరూ భయపెట్టలేదు. అస్త్రాలను సమర్థంగా ప్రయోగించాల్సిన అసలు సమరంలో టీమిండియా ఫ్లాఫ్‌‌‌‌‌‌‌‌ అయ్యింది. బ్యాటింగ్, బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఫెయిలైంది. ఫలితంగా ఆదివారం ఏకపక్షంగా జరిగిన వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌ వార్‌‌‌‌‌‌‌‌లో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. 

టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన ఇండియా 50 ఓవర్లలో 240 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ (107 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌తో 66), విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ (63 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లతో 54), రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ (31 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 47) రాణించారు. తర్వాత ఆసీస్‌‌‌‌‌‌‌‌ 43 ఓవర్లలో 241/4 స్కోరు చేసింది. ట్రావిస్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ (120 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 15 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 137) సెంచరీతో చెలరేగగా, లబుషేన్‌‌‌‌‌‌‌‌ (58 నాటౌట్‌‌‌‌‌‌‌‌) హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. హెడ్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’, విరాట్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద టోర్నీ’ అవార్డులు లభించాయి. 

రోహిత్‌‌‌‌‌‌‌‌ మెరుపులు..

స్లో, డ్రై పిచ్‌‌‌‌‌‌‌‌పై రోహిత్‌‌‌‌‌‌‌‌ మెరుపు ఆరంభాన్నిచ్చాడు. తొలి నాలుగు ఓవర్లలో మూడు ఫోర్లు, ఓ సిక్స్‌‌‌‌‌‌‌‌ బాదాడు. కానీ ఐదో ఓవర్‌‌‌‌‌‌‌‌ రెండో బాల్‌‌‌‌‌‌‌‌కు గిల్‌‌‌‌‌‌‌‌ (4) ఔటయ్యాడు. షార్ట్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను పుల్‌‌‌‌‌‌‌‌ చేయబోయి మిడాన్‌‌‌‌‌‌‌‌లో జంపాకు ఈజీ క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. ఆ వెంటనే రోహిత్‌‌‌‌‌‌‌‌ సిక్స్‌‌‌‌‌‌‌‌ బాదితే, ఏడో ఓవర్‌‌‌‌‌‌‌‌లో కోహ్లీ హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌తో టచ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు. కానీ వెంటనే బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ (1/35) అసలు దెబ్బతీశాడు. 10వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో 6, 4 బాదిన రోహిత్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. 

ఫ్రంట్‌‌‌‌‌‌‌‌ఫుట్‌‌‌‌‌‌‌‌ వచ్చి హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌ కొట్టిన అనవసరపు షాట్‌‌‌‌‌‌‌‌ను కవర్స్‌‌‌‌‌‌‌‌లో హెడ్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌గా రన్నింగ్‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌‌‌‌‌ అందుకున్నాడు. సరిగ్గా మూడు బాల్స్‌‌‌‌‌‌‌‌ తర్వాత శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ (4)ను  కమిన్స్‌‌‌‌‌‌‌‌ (2/34) బ్యాక్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌తో దెబ్బకొట్టాడు. దీంతో ఇండియా 10.2 ఓవర్లలో 81/3తో కష్టాల్లో పడింది. 

97 బాల్స్‌‌‌‌‌‌‌‌.. నో బౌండ్రీ

కోహ్లీతో జతకలిసిన రాహుల్‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌తో ముందుకెళ్లాడు. ఆసీస్‌‌‌‌‌‌‌‌ పేస్‌‌‌‌‌‌‌‌–స్పిన్‌‌‌‌‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌కు దిగడంతో  రన్స్‌‌‌‌‌‌‌‌ బాగా తగ్గాయి. 17 ఓవర్లు సింగిల్స్‌‌‌‌‌‌‌‌, డబుల్స్‌‌‌‌‌‌‌‌తోనే స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ రొటేట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇందులో 97 బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఒక్క బౌండ్రీ కూడా రాకపోవడంతో కోహ్లీపై ఒత్తిడి పెరిగింది. 56 బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసిన అతను.. కమిన్స్‌‌‌‌‌‌‌‌ (29వ ఓవర్‌‌‌‌‌‌‌‌) వేసిన షార్ట్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌ యాంగిల్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను కట్‌‌‌‌‌‌‌‌ చేయబోయి వికెట్ల మీదికి ఆడుకున్నాడు. అంతే ఒక్కసారిగా స్టేడియం మూగబోయింది. కోహ్లీ, రాహుల్​  నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 18.1 ఓవర్లలో 67 రన్స్ జోడించడంతో ఇండియా 148/4తో నిలిచింది. 

ఆసీస్‌‌‌‌‌‌‌‌ బౌలర్ల హవా..

కోహ్లీ ఔటయ్యాక ఆసీస్‌‌‌‌‌‌‌‌ బౌలర్ల హవా నడిచింది. రెండు ఎండ్‌‌‌‌‌‌‌‌ల నుంచి హేజిల్‌‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ (2/60), స్టార్క్‌‌‌‌‌‌‌‌ (3/55) స్వింగ్‌‌‌‌‌‌‌‌, షార్ట్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌ బాల్స్‌‌‌‌‌‌‌‌తో అదరగొట్టారు. దీంతో రాహుల్‌‌‌‌‌‌‌‌, జడేజా (9) సింగిల్స్‌‌‌‌‌‌‌‌కే పరిమితమయ్యారు. ఈ క్రమంలో రాహుల్‌‌‌‌‌‌‌‌ 86 బాల్స్‌‌‌‌‌‌‌‌లో హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ చేశాడు. కానీ 36వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో హేజిల్‌‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ దెబ్బకు జడేజా వెనుదిరగడంతో మిస్టర్‌‌‌‌‌‌‌‌ 360 సూర్య (18) క్రీజులోకి వచ్చాడు. 

బాల్‌‌‌‌‌‌‌‌ అనుకున్న విధంగా బ్యాట్‌‌‌‌‌‌‌‌పైకి రాకపోవడంతో సూర్య కూడా భారీ షాట్లు కొట్టలేకపోయాడు. 42వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో రాహుల్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌ కావడంతో ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఢీలా పడింది. వరుస విరామాల్లో  షమీ (6), బుమ్రా (1), సూర్య, కుల్దీప్‌‌‌‌‌‌‌‌ (10) వెనుదిరిగారు. సిరాజ్‌‌‌‌‌‌‌‌ (9 నాటౌట్‌‌‌‌‌‌‌‌) ఓ ఫోర్‌‌‌‌‌‌‌‌ కొట్టినా ఇండియా చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌నే నిర్దేశించింది. 

హెడ్‌‌‌‌‌‌‌‌ అదరహో..

ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు మంచి ఆరంభం దక్కినా బౌలర్లు అదే జోరు కంటిన్యూ చేయలేకపోయారు. షమీ (1/47) తన ఫస్ట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌కే వార్నర్‌‌‌‌‌‌‌‌ (7)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేస్తే... బుమ్రా (2/43) వరుస ఓవర్లలో డబుల్‌‌‌‌‌‌‌‌ ఝలక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. 5, 7వ ఓవర్లలో మార్ష్‌‌‌‌‌‌‌‌ (15), స్మిత్‌‌‌‌‌‌‌‌ (4)ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు పంపాడు. 47/3 స్కోరుతో కష్టాల్లో పడిన ఆసీస్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో రెండో ఓపెనర్‌‌‌‌‌‌‌‌ ట్రావిస్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌, లబుషేన్‌‌‌‌‌‌‌‌ నిలకడ తెచ్చారు. అప్పటికే పిచ్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు అనుకూలిస్తుండటంతో ఈ ఇద్దరు స్వేచ్ఛగా ఆడారు. 

సింగిల్స్‌‌‌‌‌‌‌‌తో స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ రొటేట్‌‌‌‌‌‌‌‌ చేసి క్రీజులో కుదురుకున్నారు. కుల్దీప్‌‌‌‌‌‌‌‌, జడేజా స్పిన్‌‌‌‌‌‌‌‌ కూడా పని చేయకపోవడం హెడ్‌‌‌‌‌‌‌‌కు బాగా కలిసొచ్చింది. ఆన్‌‌‌‌‌‌‌‌సైడ్‌‌‌‌‌‌‌‌, స్క్వేర్‌‌‌‌‌‌‌‌ లెగ్‌‌‌‌‌‌‌‌లో బౌండ్రీలు కొడుతూ 58 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ పూర్తి చేశాడు. మధ్యలో బుమ్రా లెంగ్త్‌‌‌‌‌‌‌‌ బాల్స్‌‌‌‌‌‌‌‌తో ఇబ్బందిపెట్టినా లబుషేన్‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌కే ప్రాధాన్యమిచ్చి వికెట్‌‌‌‌‌‌‌‌ కాపాడుకున్నాడు. . 95 బాల్స్‌‌‌‌‌‌‌‌లో ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ మార్క్‌‌‌‌‌‌‌‌ అందుకున్న హెడ్‌‌‌‌‌‌‌‌ తర్వాత జోరు పెంచాడు. జడ్డూ, కుల్దీప్‌‌‌‌‌‌‌‌ను టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేసి సిక్సర్లు బాదాడు. 

యాంకర్‌‌‌‌‌‌‌‌ పాత్రను సమర్థంగా పోషించిన లబుషేన్‌‌‌‌‌‌‌‌ 99 బాల్స్‌‌‌‌‌‌‌‌లో హాఫ్‌‌‌‌‌‌‌‌ మార్క్‌‌‌‌‌‌‌‌ను అందుకున్నాడు. 43 బాల్స్‌‌‌‌‌‌‌‌లో మరో రెండు రన్స్‌‌‌‌‌‌‌‌ కావాల్సిన దశలో హెడ్‌‌‌‌‌‌‌‌ ఔటవడంతో నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 192 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. చివర్లో మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ (2 నాటౌట్‌‌‌‌‌‌‌‌) విన్నింగ్‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌ కొట్టాడంతో  ఇండియా నిరాశగా మిగిలిపోయింది.

స్కోరు బోర్డు


ఇండియా: రోహిత్‌‌‌‌‌‌‌‌ (సి) హెడ్‌‌‌‌‌‌‌‌ (బి) మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ 47, గిల్‌‌‌‌‌‌‌‌ (సి) జంపా (బి) స్టార్క్‌‌‌‌‌‌‌‌ 4, కోహ్లీ (బి) కమిన్స్‌‌‌‌‌‌‌‌ 54, అయ్యర్‌‌‌‌‌‌‌‌ (సి) ఇంగ్లిస్‌‌‌‌‌‌‌‌ (బి) కమిన్స్‌‌‌‌‌‌‌‌ 4, రాహుల్‌‌‌‌‌‌‌‌ (సి) ఇంగ్లిస్‌‌‌‌‌‌‌‌ (బి) స్టార్క్‌‌‌‌‌‌‌‌ 66, జడేజా (సి) ఇంగ్లిస్‌‌‌‌‌‌‌‌ (బి) హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ 9, సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ (సి) ఇంగ్లిస్‌‌‌‌‌‌‌‌ (బి) హేజిల్‌‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ 18, షమీ (సి) ఇంగ్లిస్‌‌‌‌‌‌‌‌ (బి) స్టార్క్‌‌‌‌‌‌‌‌ 6, బుమ్రా (ఎల్బీ) జంపా 1, కుల్దీప్‌‌‌‌‌‌‌‌ (రనౌట్‌‌‌‌‌‌‌‌) 10, సిరాజ్‌‌‌‌‌‌‌‌ (నాటౌట్‌‌‌‌‌‌‌‌) 9, ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రాలు: 12, మొత్తం: 50 ఓవర్లలో 240 ఆలౌట్‌‌‌‌‌‌‌‌. వికెట్లపతనం: 1–30, 2–76, 3–81, 4–148, 5–178, 6–203, 7–211, 8–214, 9–226, 10–240. బౌలింగ్‌‌‌‌‌‌‌‌: స్టార్క్‌‌‌‌‌‌‌‌ 10–0–55–3, హేజిల్‌‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ 10–0–60–2, మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ 6–0–35–1, కమిన్స్‌‌‌‌‌‌‌‌ 10–0–34–2, జంపా 10–0–44–1, మార్ష్‌‌‌‌‌‌‌‌ 2–0–5–1, హెడ్‌‌‌‌‌‌‌‌ 2–0–4–0. ఆస్ట్రేలియా: వార్నర్‌‌‌‌‌‌‌‌ (సి) కోహ్లీ (బి) షమీ 7, హెడ్‌‌‌‌‌‌‌‌ (సి) గిల్‌‌‌‌‌‌‌‌ (బి) సిరాజ్‌‌‌‌‌‌‌‌ 137, మార్ష్‌‌‌‌‌‌‌‌ (సి) రాహుల్‌‌‌‌‌‌‌‌ (బి) బుమ్రా 15, స్మిత్‌‌‌‌‌‌‌‌ (ఎల్బీ) బుమ్రా 4, లబుషేన్‌‌‌‌‌‌‌‌ (నాటౌట్‌‌‌‌‌‌‌‌) 58, మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ (నాటౌట్‌‌‌‌‌‌‌‌) 2, ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రాలు: 18, మొత్తం: 43 ఓవర్లలో 241/4. వికెట్లపతనం: 1–16, 2–41, 3–47, 4–239. బౌలింగ్‌‌‌‌‌‌‌‌: బుమ్రా 9–2–43–2, షమీ 7–1–47–1, జడేజా 10–0–43–0, కుల్దీప్‌‌‌‌‌‌‌‌ 10–0–56–0, సిరాజ్‌‌‌‌‌‌‌‌ 7–0–45–1.

 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండు ఎడిషన్లలో ఐదు అంతకంటే ఎక్కువ ఫిఫ్టీలు కొట్టిన తొలి ప్లేయర్​ కోహ్లీ.ఈ టోర్నీలు ఆరు ఫిఫ్టీలు రాబట్టిన కోహ్లీ  2019 టోర్నీలో ఐదు సాధించాడు.

వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆతిథ్యం ఇచ్చి  ఫైనల్లో ఓడిన రెండో జట్టు ఇండియా. 1979 ఫైనల్లో  వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీమ్‌ ‌‌‌‌‌‌‌ ఇంగ్లండ్  ఓడింది.

అత్యధికంగా ఆరుసార్లు వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గిన జట్టు ఆస్ట్రేలియా.  1987, 1999, 2003, 2007, 2015లోనూ ఆ టీమ్ విజేతగా నిలిచింది. ఇండియా, వెస్టిండీస్ రెండేసి వరల్డ్ కప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సెకండ్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. 

ఈ టోర్నీలో రోహిత్ రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రికార్డుకెక్కాడు.

 గ్రౌండ్‌‌లోకి పాలస్తీనా సపోర్టర్


స్టేడియంలో భారీ సంఖ్యలో మోహరించిన భద్రతా సిబ్బంది కండ్లుగప్పి పాలస్తీనా మద్దతుదారుడు గ్రౌండ్‌‌లోకి వచ్చాడు. కోహ్లీ భుజంపై చేసి వేసి హగ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇండియా ఇన్నింగ్స్‌‌ ఫస్ట్ డ్రింక్స్‌‌ బ్రేక్‌‌లో ఈ ఘటన జరిగింది. ‘పాలస్తీనాపై బాంబుల దాడి ఆపండి, పాలస్తీనాను కాపాడండి’ అనే నినాదాలు రాసుకున్న టీ షర్ట్ వేసుకొని,  ఆ దేశ జెండా పట్టుకున్న అతడిని ఆస్ట్రేలియాకు చెందిన వేన్ జాన్సన్‌‌గా గుర్తించారు.  సిబ్బంది అతడిని పోలీసులకు అప్పగించారు. 

నీలి సముద్రంలా మోదీ స్టేడియం

అహ్మదాబాద్‌‌ నరేంద్ర మోదీ స్టేడియం మరోసారి నీలి సముద్రాన్ని తలపించింది. ఇండియా బ్లూ జెర్సీలు ధరించిన అభిమానులతో కిక్కిరిసింది.   మ్యాచ్‌‌కు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, ఆసీస్‌ డిప్యూటీ పీఎం రిచర్డ్​ మార్లెస్, బాలీవుడ్‌ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఆటకు ముందు ఇండియన్ ఫోర్స్‌ విమానాల ఎయిర్‌‌షో, ఇన్నింగ్స్‌ బ్రేక్‌లో ఆటపాట, చివర్లో ఫైర్‌‌ వర్క్స్ ఆకట్టుకున్నాయి. 

ఈ రోజు మాది కాదు. అయినా మా టీమ్‌ను చూస్తే గర్వంగా ఉంది. మరో 20, 30 రన్స్‌ చేస్తే బాగుండేది. రాహుల్‌, విరాట్‌ క్రీజులో ఉన్నప్పుడు 270, 280 స్కోరు చేస్తామని భావించాం. కానీ వరుసగా వికెట్లు కోల్పోయాం. 240 టార్గెట్‌ను కాపాడుకునేందుకు మేం కూడా శ్రమించాం. ఆరంభంలోనే వికెట్లు తీయాలనుకున్నాం.  ఆ విషయంలో సక్సెస్‌ అయ్యాం. కానీ హెడ్‌, లబుషేన్‌ అద్భుతంగా ఆడారు. ఈ విజయం  క్రెడిట్‌ వాళ్లదే.       
-  రోహిత్‌ శర్మ

పిచ్‌ అనుకున్న దానికంటే నెమ్మదిగా ఉంది.  దీనిపై మా బౌలింగ్‌ బాగా పడింది.  ఇండియా ను 300లోపే కట్టడి చేయాలనుకున్నాం. కానీ  240 రన్సే చేయడం మా  కాన్ఫిడెన్స్‌ పెంచింది.  ఆరంభంలో వికెట్లు పడినా హెడ్‌ మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లిన విధానం సూపర్​. లబుషేన్‌ కూడా బాగా ఆడాడు. తొలి రెండు మ్యాచ్‌లు ఓడిన తర్వాత మేం కప్‌ గెలవాలని టార్గెట్‌గా పెట్టుకున్నాం. ఓ ప్యాషన్‌తో ఆట ఆడాం. ఈ విజయం సుదీర్ఘకాలం గుర్తుండిపోతుంది. 

- ప్యాట్ కమిన్స్‌