న్యూఢిల్లీ : అమెరికా తలసరి ఆదాయంలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి మనదేశానికి దాదాపు 75 ఏళ్లు పట్టవచ్చని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. వరల్డ్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2024: ది మిడిల్ ఇన్‌కమ్ ట్రాప్ ప్రకారం, సంపన్నదేశంగా మారడానికి ఇండియాతోపాటు వంద దేశాలు చాలా అడ్డంకులను దాటాలి.
యూఎస్ తలసరి ఆదాయంలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి చైనాకు పదేళ్లకు పైగా పడుతుంది. ఇండోనేషియాకు దాదాపు 70 సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం ఇండియా తలసరి ఆదాయం రూ.8,230 వరకు ఉండగా, అమెరికాలో ఇది దాదాపు 80 వేల డాలర్లు (దాదాపు రూ.67 లక్షలు) ఉంది.