భారత్ క్షిపణి పరీక్ష సక్సెస్

 భారత్ క్షిపణి పరీక్ష సక్సెస్

 ఒడిశా తీరంలో భారత్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. భారత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో మంగళవారం నిర్వహించిన ఈ క్షిపణి ప్రయోగంతో భారత్ కీర్తి మరింత పెరిగింది. భూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే షార్ట్ రేంజ్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ను భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఈ మిసైల్‌ను భారత సైన్యం కోసం DRDO ప్రత్యేకంగా తయారుచేసింది. బాలసోర్ జిల్లాలోని చాందీపూర్‌లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ITR) పై ట్రక్కుపై నుంచి క్షిపణినీ విజయవంతంగా పరీక్షించారు. ట్రాకింగ్ చేసే వ్యవస్థ కూడా ఇందులో ఉంది.

360 డిగ్రీల క‌వ‌రేజ్‌, తక్కువ బరువు, హైమొబిలిటీతో పాటు తక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఛేదించేందుకు అత్యంత ఆధునిక వ్యవస్థతో ఈ మిసైల్‌ను అభివృద్ధి చేశారు. సైన్యంలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఆకాశ్ క్షిపణి స్థానంలో లేటెస్ట్ గా అభివృద్ధి చేసిన QRSAMను త్వరలో ప్రవేశపెట్టనున్నారు.