IND vs AUS 3rd Test: 89 పరుగులకే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ డిక్లేర్.. భారత్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్

IND vs AUS 3rd Test: 89 పరుగులకే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ డిక్లేర్.. భారత్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్

బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. డ్రా ఖాయమనుకుంటే భారత పేసర్లు చెలరేగి ఆస్ట్రేలియా భరతం పట్టారు. ఏడు వికెట్లు తీసి మ్యాచ్ ను ఫలితం దిశగా తీసుకెళ్తున్నారు. లంచ్ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 274 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆసీస్ భారత్ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని విధించింది.  

ఓవర్ నైట్ స్కోర్ 9 వికెట్ల నష్టానికి 253 పరుగులతో చివరి రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మరో 7 పరుగులు జోడించి 260 పరుగులకు ఆలౌట్ అయింది. ఆకాష్ దీప్ చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అనతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు టీమిండియా ఫాస్ట్ బౌలర్లు బిగ్ షాక్ ఇచ్చారు. ఆసీస్ బ్యాటర్లను కుదురుకోనీకుండా వికెట్లు తీశారు. ఒక్కరు కూడా కనీసం 30 పరుగులు చేయలేకపోయారు. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీసుకున్నాడు. ఆకాష్ దీప్, మహమ్మద్ సిరాజ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. 

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి రోజు ఆస్ట్రేలియా బ్యాటర్లు ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలు చేసి ఆస్ట్రేలియా భారీ స్కోర్ అందించారు.  భారత బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లు తీసుకున్నాడు.