కమ్యూనిస్టుల అవసరం పెరుగుతోంది

కమ్యూనిస్టుల అవసరం పెరుగుతోంది
  •     సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

ఖమ్మం టౌన్, వెలుగు : దేశంలో కమ్యూనిస్టుల అవసరం పెరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. 99 ఏండ్ల కమ్యూనిస్ట్‌‌‌‌‌‌‌‌ పార్టీ చరిత్రలో అనేక పోరాటాలు, ప్రజా ఉద్యమాలు, త్యాగాలు ఉన్నాయని, కార్మిక, కర్షక హక్కుల కోసం పోరాడింది సీపీఐ మాత్రమేనన్నారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో గురువారం నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. 

ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ దేశ విచ్ఛిన్నాన్ని కోరుకుంటే, కమ్యూనిస్ట్‌‌‌‌‌‌‌‌ పార్టీ కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిందన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ పారిశ్రామిక వేత్తలు, సంపన్న వర్గాల కోసమే పనిచేసిందన్నారు. పూటకో పార్టీ మారేవారు కమ్యూనిస్టులను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, బీజేపీతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. కమ్యూనిస్టుల ఐక్యతకు సీపీఐ కృషి చేస్తోందని చెప్పారు. 

అంతకుముందు సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో పాత ధర్నా చౌక్‌‌‌‌‌‌‌‌ నుంచి భక్త రామదాసు కళాక్షేత్రం వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేశ్‌‌‌‌‌‌‌‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, మహ్మద్‌‌‌‌‌‌‌‌ మౌలానా, జమ్ముల జితేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, యర్రా బాబు, షేక్‌‌‌‌‌‌‌‌ జానీమియా, ఏపూరి లతాదేవి పాల్గొన్నారు.